News January 18, 2026

నాగర్‌కర్నూల్ జిల్లాలో విసిరిన చలి పంజా

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతుంది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా అమ్రాబాద్ మండలంలో 10.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అచ్చంపేట మండలంలో 11.0, బల్మూరు, తెలకపల్లి, 11.1, బిజనేపల్లి, వెల్దండ, పదర, కల్వకుర్తి మండలాలలో 11.7 నాగర్‌కర్నూల్, ఊర్కొండ మండలంలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉదయం వేళలో ప్రజలు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Similar News

News April 9, 2026

NLG: నిలిచిన ‘డయల్ యువర్ ఆర్ఎం’

image

నల్గొండ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు గాలికొదిలేయడంపై మండి పడుతున్నారు. గతంలో ప్రతినెలా క్రమం తప్పకుండా జరిగే ‘డయల్ యువర్ ఆర్ఎం’ కార్యక్రమం గత మూడు నెలలుగా నిర్వహించడం లేదు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రయాణికులు అయోమయంలో పడ్డారు. గతంలో నెలకోసారి జరిగే ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికులు నేరుగా అధికారులకు ఫిర్యాదు చేసేవారు.

News April 9, 2026

ఎడపల్లి: టీజీఆర్‌జేసీ సెట్‌కు విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి

image

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీఆర్‌జేసీ సెట్‌కు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ గంగా శంకర్ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం(ఇంగ్లీష్ మీడియం)లో ప్రవేశానికి ఏప్రిల్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మే 5న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. www.tgrjc.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News April 9, 2026

IPL: బ్రెవిస్, కమిన్స్, స్టార్క్ రీఎంట్రీ ఎప్పుడంటే?

image

గాయం కారణంగా తొలి 3 మ్యాచులకు దూరమైన CSK బ్యాటర్ బ్రెవిస్ ఈ నెల 11న DCతో మ్యాచులో ఆడబోతున్నట్లు ప్రకటించారు. ఇదే మ్యాచులో DC పేసర్ స్టార్క్ కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. అటు RCB పేసర్ హేజిల్‌వుడ్ ఈ నెల 12న MIతో మ్యాచుకు అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. SRH కెప్టెన్ కమిన్స్ కూడా అనుకున్న సమయం కంటే ముందే మ్యాచులు ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.