News January 18, 2026

ఖమ్మం: ట్రాన్స్‌జెండర్ల స్వయం ఉపాధికి చేయూత

image

ఖమ్మం జిల్లాలో ట్రాన్స్‌జెండర్ల స్వయం ఉపాధి కోసం 100% సబ్సిడీతో రూ. 75 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి విజేత తెలిపారు. 18-55 ఏళ్ల వయస్సు ఉండి, కలెక్టర్ జారీ చేసిన ఐడీ కార్డు ఉన్నవారు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలి. ఆసక్తి గలవారు ఈ నెల 25లోపు జిల్లా సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News January 23, 2026

45 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభించకుంటే రద్దు: కలెక్టర్

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇల్లు మంజూరైన 45 రోజుల్లోపు పునాది పనులు ప్రారంభించని పక్షంలో, ఆ మంజూరును రద్దు చేయాలని స్పష్టం చేశారు. రద్దయిన చోట కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు తీసుకోవాలని ఎంపీడీఓలు, తహశీల్దార్లకు సూచించారు. ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహించవద్దని, పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

News January 23, 2026

గవర్నర్‌కు ‘ఖమ్మం’ రుచుల విందు!

image

నేడు సూర్యాపేట జిల్లాకు రానున్న గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ కోసం ఖమ్మం వంటకాలు సిద్ధమవుతున్నాయి. నగరంలోని ‘అమ్మ మెస్‌’, ‘రెస్టిన్‌’ హోటల్‌ నిర్వాహకులు ఏకంగా 32రకాల శాకాహార వంటకాలతో మెనూ ఖరారు చేశారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పనసకాయ బిర్యానీ, పచ్చిమిర్చి టమాట పచ్చడి సిద్ధం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల కార్యక్రమాలకు ఈ హోటల్స్ విందు అందించాయి.

News January 23, 2026

సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: ఖమ్మం అదనపు కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ ఓనర్లు, డీలర్లు, సేల్స్ అధికారులు, పంప్ ఆపరేటర్లకు సీపీఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. హార్ట్ ఎటాక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చన్నారు. సీపీఆర్‌కు వైద్య అనుభవం అవసరం లేదని, సాధారణ ప్రజలు కూడా చేయవచ్చన్నారు.