News January 18, 2026

హైదరాబాద్ మళ్లీ ‘ఆమె’దే!

image

త్వరలో ఎన్నికలు జరగనున్న జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలిలో మేయర్‌గా మరోసారి మహిళే ఎన్నిక కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఛైర్మన్లు, మేయర్లకు శనివారం లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. పది మున్సిపల్ కార్పొరేషన్లకు గానూ జీహెచ్ఎంసీకి మహిళ (జనరల్) రిజర్వు కావడంతో రాబోయే పాలకమండలిలోనూ హైదరాబాద్‌లో మహిళే చక్రం తిప్పనున్నారు.

Similar News

News February 11, 2026

HYDలో Low-Budget పార్టీ ఇదే!

image

సాయంత్రం 6 దాటిందంటే చాలు మన HYD కుర్రాళ్లది ఒక సెపరేట్ లోకం. పబ్బులు, డిస్కోలు కాదు బాసూ.. మెట్రో కింద చాయ్ బండ్లు, చెరువు గట్టు మీద బెంచీలే వీళ్ల అడ్డాలు. గట్టిగా మ్యూజిక్ ఉండదు, స్ట్రోబ్ లైట్లు అసలే ఉండవు. జస్ట్ ఫ్రెండ్స్‌తో కలిసి ఒక ప్లేలిస్ట్ వినడం, ముచ్చట్లు, వీలైతే ఒక రీల్ ప్లాన్ చేసుకోవడం.. అంతే. ఇంట్లో వాళ్లకు “చాయ్ తాగి వస్తా” అని చెబుతారు.. కానీ వీరికి ఇది ఒక లో-బడ్జెట్ పార్టీ లాంటిదే.

News February 11, 2026

EXIT POLLS.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇలా..!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 4 నుంచి 6 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 2 నుంచి 3 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.

News February 11, 2026

Peoples Pulse.. ఉమ్మడి రంగారెడ్డి ఎగ్జిట్ పోల్స్ ఇవే!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీలకు సంబంధించి 294 వార్డుల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 104-112 వార్డులు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BRS 95-104, BJP 16-18, MIM 2-3, CPM 2-3, ఇతరులు 6-8 వార్డులు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.