News January 18, 2026
2026 దావోస్ సమ్మిట్ థీమ్ ఇదే!

‘ఎ స్పిరిట్ ఆఫ్ డైలాగ్’ థీమ్‌తో 2026 దావోస్ సమ్మిట్ జరగనుంది. ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన సహకారం, ఆవిష్కరణలు, స్థిరమైన వృద్ధిపై ప్రధానంగా చర్చిస్తారు. ప్రతి ఏడాది JANలో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశాలను 1971లో జర్మన్ ఎకనామిక్ సైంటిస్ట్ ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ స్టార్ట్ చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలు, పరిష్కారాలపై చర్చకు వేదికగా సమ్మిట్ నిర్వహిస్తున్నారు.
Similar News
News February 19, 2026
అభి‘షేక్’ ఆడిస్తాడనుకుంటే..

భారత స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తున్నారు. టన్నుల కొద్దీ రన్స్ చేస్తారనుకుంటే <<19177966>>డకౌట్లతో<<>> రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ WCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఖాతా కూడా తెరవలేదు. నిన్నటి మ్యాచ్‌లో సిరాజ్ జెర్సీతో బ్యాటింగ్‌కు వచ్చినా ఫలితం మారలేదు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్‌పై ఒత్తిడి పడుతోంది. అభిషేక్ ఫామ్‌లోకి రాకపోతే సూపర్-8 మ్యాచుల్లో టీమ్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.
News February 19, 2026
మారే ప్రమాణాలు- మున్ముందు ప్రమాదాలు

నీట్ PGలో 0 మార్కుల అభ్యర్థులకూ అడ్మిషన్ రావడం ఆందోళనకరం. సీట్లు భర్తీ చేయడం, డాక్టర్ల కొరత తీర్చేందుకు ఇలా మార్కులు తగ్గించి అడ్మిషన్లు ఇవ్వడంపై మెడికల్ బాడీస్ సైతం అభ్యంతరం తెలిపాయి. ఇది ఫ్యూచర్‌లో భారత ఆరోగ్య రంగాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యగా అభివర్ణించాయి. అవసరమైతే స్టూడెంట్స్‌కు ట్రైనింగ్, ఫీజు మినహాయింపు, ఇన్సెంటివ్స్ లాంటివి ఇవ్వాలి తప్ప ఇదేం నిర్ణయమని సగటు మనిషి అభిప్రాయం. మీరేమంటారు..?
News February 19, 2026
ఆత్మ గౌరవం కోసం కొన్ని మార్గదర్శకాలు

☛ నిన్ను దూరం పెట్టే వారికి దగ్గరవ్వాలని ప్రయత్నించకు.
☛నీ నిజాయితీని గుర్తించని చోట నీ విలువైన కాలాన్ని వృథా చేయకు.
☛ ఆత్మాభిమానాన్ని మించిన సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదని తెలుసుకో.
☛ మనస్ఫూర్తిగా పిలవని చోటుకి, అది ఎంత పెద్ద ఇల్లైనా వెళ్ళకు.
☛ నీది కాని దాని మీద, నిన్ను దహించేంత అతిగా ప్రేమను పెంచుకోకు.


