News January 18, 2026

గ్రేటర్ HYDలో 20న ఆటోల బంద్!

image

నగర వ్యాప్తంగా జనవరి 20న ఆటోల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మహాత్మా గాంధీ ఆటో డ్రైవర్ల జేఏసీ కన్వీనర్ మహమ్మద్ తెలిపారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు నిరసనగా, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆటో డ్రైవర్లతో భారీ ధర్నా చేపడతామని ప్రకటించారు. ప్రభుత్వమే స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆయన కోరారు.

Similar News

News January 30, 2026

పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

image

US-ఇరాన్‌ వైరం చమురు మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. లండన్ మార్కెట్‌లో బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 2.4% పెరిగి $70.06కు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కూడా 2.6% పెరిగి బ్యారెల్ $64.82కి చేరింది. US దాడి చేస్తే ఇరాన్ ఆయిల్ ఉత్పత్తి రోజుకు 3M బ్యారెల్స్ తగ్గనుందని నిపుణుల అంచనా. హార్ముజ్ జలసంధి రవాణాపై ప్రభావం పడొచ్చు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

News January 30, 2026

భద్రాద్రి: ఇదేం తీరు.. పల్లె ప్రకృతి వనంలో సమాధి

image

బూర్గంపాడు మండలం తాళ్లగొమ్మురు గ్రామపంచాయతీలోని పల్లె ప్రకృతి వనం సమాధులకు నిలయంగా మారుతోంది. వనంలో కొందరు పాలరాయితో సమాధుల నిర్మాణం చేపడుతున్నా సర్పంచ్, సెక్రటరీ పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కట్టడాలను నిలిపివేయాలని, ప్రకృతి వనాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న పాలకవర్గంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News January 30, 2026

కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీఎంహెచ్ఓ

image

ప్రజలందరి భాగస్వామ్యంతో కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మిద్దామని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ పిలుపునిచ్చారు. గతలమడుగు గ్రామపంచాయతీ కార్యాలయంలో స్పర్ష్ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుష్ఠు వ్యాధిపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు