News January 18, 2026

మేడ్చల్ జిల్లాల్లో SSC, INTER పరీక్షలు రాసేది ఎంతమందంటే..?

image

వచ్చేనెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను అధికారులు లెక్కించారు. 10వ తరగతి పరీక్షలకు 46వేల మంది, ఇంటర్ పరీక్షలకు 1.35 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల ఎంపికను అధికారులు వేగవంతం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎగ్జామ్ సెంటర్లను ఎంపిక చేయనున్నారు.

Similar News

News January 21, 2026

గ్రామపంచాయతీ నుంచి రామగుండం కార్పొరేషన్ వరకు..

image

జనగామ గ్రామ పంచాయతీ 11 వార్డులతో సర్పంచిగా గీట్ల జనార్థన్ రెడ్డి నుంచి రామగుండం 60 డివిజన్ల కార్పొరేషన్ వరకు విస్తరించింది. 1982లో రామగుండం నోటిఫైడ్ ఏరియా, 1957- 2009 వరకు RGM ప్రాంతం మేడారం నియోజకవర్గంలో ఉండేది. 1995లో మున్సిపాలిటీగా, 2003లో కార్పొరేషన్‌గా హోదా పెరిగింది. కార్పొరేషన్‌కు ఈసారి మూడోసారి ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 93.87 చ.కి. వైశాల్యంలో విస్తరించి ఉంది.

News January 21, 2026

NZB: 1931లో మున్సిపాలిటీ.. 2005లో కార్పొరేషన్

image

NZB మున్సిపాలిటీ 1931 సంవత్సరంలో ఏర్పడింది. 1987లో దీన్ని ‘స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’గా అప్‌గ్రేడ్ చేశారు. 2005 మార్చి 5న ప్రభుత్వం జారీ చేసిన GO No.109 ప్రకారం నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్‌గా మారింది. ప్రస్తుతం ఇది నిజామాబాద్ నగరపాలక సంస్థ పేరుతో 60 వార్డులతో పరిపాలన కొనసాగిస్తోంది.

News January 21, 2026

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు

image

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌ <>(RGNIYD) <<>>6 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు రేపు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును PG (ఎకనామిక్స్, సోషియాలజీ, యూత్ స్టడీస్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్, యూత్ డెవలప్‌మెంట్), NET/SLAT/SET, PhD ఉత్తీర్ణులు అర్హులు. నెలకు రూ.52వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.rgniyd.gov.in