News January 18, 2026

మంచిర్యాల: రేపటి ‘ప్రజావాణి’ రద్దు

image

మున్సిపల్ ఎన్నికల విధులు, మంత్రుల పర్యటన నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర పరిపాలనా పరమైన పనుల ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని, కలెక్టరేట్‌కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 10, 2026

ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం: MNCL కలెక్టర్

image

మున్సిపల్ పోలింగ్‌కు జిల్లాలోని 1 కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్ 60 డివిజన్లకు 265 కేంద్రాలు, బెల్లంపల్లి 34 వార్డులకు 68 కేంద్రాలు, చెన్నూర్‌లో 18వార్డులకు 36 కేంద్రాలు, క్యాతన్‌పల్లిలో 22 వార్డులకు 45 కేంద్రాలు, లక్షెట్టిపేట 15 వార్డులకు 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News February 10, 2026

1300 మందితో బందోబస్తు: కరీంనగర్ సీపీ

image

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 1300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ సహా హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో నిఘా పెంచామన్నారు. సున్నిత కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 10, 2026

క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు: కలెక్టర్

image

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం క్యాబ్ బుకింగ్ విధానంలోనే వ్యవసాయానికి డ్రోన్ సేవలను కూడా సులభంగా బుక్కు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతులు, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఏలూరులో కలెక్టర్ ఆవిష్కరించారు.