News January 18, 2026
మన మేడ్చల్ జిల్లాలో మొక్కజొన్న పంట

మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఈ యాసంగి సీజన్‌లో రైతులు మొక్కజొన్న పంటను శాస్త్రీయ వంగడాలతో సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సీజన్‌లో సుమారు 78 ఎకరాలలో శాస్త్రవేత్తలు సూచించిన నూతన వంగడాల సాగుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో అధిక దిగుబడి సాధించినట్లయితే, వివిధ రకాల శాస్త్రీయ వంగడాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపనున్నారు.
Similar News
News January 23, 2026
NLG: రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: ఎస్పీ

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం నల్గొండ ఆర్టీసీ డిపోలో ఆర్ఎం కె.జాన్ రెడ్డి ఆధ్వర్యంలో రీజియన్ స్థాయిలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై మాట్లాడుతూ.. ప్రయాణంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
News January 23, 2026
శ్రీశైల మల్లన్న దంపతులకు ఘనంగా ఊయల సేవ

లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైల మల్లన్న దంపతులకు శుక్రవారం రాత్రి ఊయల సేవ నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ వేడుకలో స్వామి, అమ్మవారిని రకరకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అర్చకులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో పుష్పార్చన జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక స్వాములు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రమణీయంగా సాగిన ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
News January 23, 2026
‘రిపబ్లిక్ డే‘ వేడుకల్లో అమరావతి రైతులకు ప్రత్యేక గ్యాలరీ

AP: రిపబ్లిక్ డే ని మొదటిసారి ఈ ఏడాది అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డులో నిర్వహించేందుకు CRDA అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో అమరావతి రైతులకు ప్రత్యేక VIP గ్యాలరీ ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ఆహ్వాన పత్రికలు పంపుతున్నారు. 13 వేల మందికి వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకూ రిపబ్లిక్ డే, స్వతంత్ర దినోత్సవాలను విజయవాడ మున్సిపల్ స్టేడియంలో చేపట్టేవారు.


