News January 18, 2026
తిరుపతి: మహిళలకు ఫ్రీ ట్రైనింగ్

తిరుచానూరు సమీపంలోని NTR మహిళా ప్రాంగణం నందు ఔత్సాహిక మహిళలకు వివిధ రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఫర్జానా పేర్కొన్నారు. సారీ రోలింగ్ – 10 రోజులు, మిల్లెట్స్ స్నాక్స్ తయారీ, (ప్యాకింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్) – 15 రోజులు కిచెన్, టెర్రస్ గార్డెనింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రాం – 30 రోజులు. 18- 45 ఏళ్లలోపు 8వ తరగతి పాసైన మహిళలు అర్హులన్నారు.
Similar News
News March 16, 2026
ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని APSDMA హెచ్చరించింది. అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News March 16, 2026
కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలకు నేటి నుంచే దరఖాస్తులు

TG: రాష్ట్రంలో 93 KGBVల్లో ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఇవాళ్టి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CETకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200. ప్రవేశ పరీక్ష మే 3న జరగనుంది. KGBVల్లో సీట్లు పొందిన బాలికలకు జేఈఈ, నీట్, క్లాట్, ఎప్‌సెట్ తదితర ప్రవేశ పరీక్షలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
News March 16, 2026
OTD: సచిన్ శతకాల ‘సెంచరీ’ చేసిన వేళ!

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి 14 ఏళ్లు. 2012 మార్చి 16న సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు కొట్టిన తొలి, ఏకైక బ్యాటర్‌గా నిలిచారు. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై 114 పరుగులతో ఈ ఘనత అందుకున్నారు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరకపోవడం గమనార్హం. ప్రస్తుత యాక్టివ్ ప్లేయర్లలో కోహ్లీ(85) ఒక్కరే ఆ మైలురాయికి దగ్గర్లో ఉన్నారు.


