News January 18, 2026
KNR: మొదలైన సమ్మక్క సారలమ్మ ఎత్తు బంగారం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమ్మక్క – సారలమ్మ ఎత్తు బంగారం మొక్కులు ప్రారంభమయ్యాయి. తమ కోరికలు నెరవేరిన భక్తులు అమ్మవార్లకు ‘నిలువెత్తు బంగారం’ (బెల్లం) సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద పెద్ద కిరాణా షాపుల్లో ఎత్తు బంగారం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. మీ ప్రాంతంలో నిలువెత్తు బంగారం ఇవ్వడం ప్రారంభమైందా..? కామెంట్ చేయండి.
Similar News
News February 12, 2026
ఆదిలాబాద్: బ్యాలెట్ బాక్స్‌లోనే భవితవ్యం

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. పోలింగ్ ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకోగా, అభ్యర్థుల్లో మాత్రం ఉత్కంఠ పెరిగింది. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా, ఓటింగ్ సరళిపై స్పష్టమైన అంచనాకు రాలేక లోలోన ఆందోళన చెందుతున్నారు. అందరి దృష్టి ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులపైనే ఉంది.
News February 12, 2026
టెన్త్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు టీచర్లు!

AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ పలు మార్పులు చేసింది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఉపాధ్యాయులే ఇన్విజిలేషన్ చేస్తుండగా, ఇకపై ప్రైవేటు టీచర్లకూ అవకాశం ఇవ్వనుంది. ఈ ఏడాది నుంచి 25% మంది ప్రైవేటు టీచర్లను తీసుకోనుంది. ఆన్‌లైన్ విధానంలో ఇన్విజిలేషన్ బాధ్యతలు కేటాయించనుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 4 నుంచి 10 రోజులు జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది.
News February 12, 2026
18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు

NLR: డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ విభాగాల్లో లోయర్, హయ్యర్ గ్రేడ్లకు సంబంధించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలను ఈనెల 18 నుంచి 21 వరకు నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను www.bse.ap.gov.inలో అందుబాటులో ఉంచామన్నారు. హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డును తప్పక తీసుకు రావాలని కోరారు.


