News January 18, 2026

బోథ్‌లో బార్ హెడెడ్ గీస్ పక్షులు

image

బోథ్ మండలంలోని గొల్లాపూర్ చెరువులో సుమారు 300కి పైగా బార్-హెడెడ్ గీస్ (Bar-headed Geese) పక్షులను గుర్తించినట్లు ఎఫ్ఐఆర్ ప్రణయ్ తెలిపారు. ఈ పక్షుల గణనను అటవీ శాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఇండియా సంయుక్తంగా నిర్వహించాయన్నారు. శీతాకాల వలస పక్షుల్లో ప్రసిద్ధి చెందిన ఈ గీస్‌లు ఏటా మధ్య ఆసియా, టిబెట్ ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని తడిచెరువులు, సరస్సులను ఆశ్రయిస్తాయన్నారు.

Similar News

News February 11, 2026

శివరాత్రికి మైపాడు వెళ్తారా..?

image

మైపాడు బీచ్ వద్ద ఉన్న భారీ శివలింగం మహా శివరాత్రికి సిద్ధమైంది. సముద్ర తీరాన ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఈ లింగాన్ని తీర్చిదిద్దారు. మెట్ల ద్వారా పైకి వెళ్లి అభిషేకం చేసే సౌకర్యం ఉండటంతో.. శివరాత్రి నాడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. సముద్ర స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకునేందుకు పర్యాటకులు ఇక్కడకు ఆసక్తి చూపుతారు. ప్రకృతి ఒడిలో ఈ శివలింగం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ నిలవనుంది.

News February 11, 2026

పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

image

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.

News February 11, 2026

వివాహ దోషాలకు పరిష్కారం స్వయంవర పార్వతీ మంత్రం

image

అన్ని అర్హతలున్నా పెళ్లి సంబంధాలు సెట్ కానప్పుడు స్వయంవర పార్వతీ మంత్రం పఠించాలని పండితులు చెబుతున్నారు. ‘శివుడిని భర్తగా పొందడానికి పార్వతీ దేవి ఈ మంత్రం జపించిందని పురాణాల వాక్కు. నిష్ఠతో ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపిస్తే జాతక దోషాలు హరిస్తాయి. అమ్మవారికి పసుపు, కుంకుమలతో పూజ చేస్తే కళ్యాణ యోగం వస్తుంది. ఈ సాధన మనసులో ధైర్యాన్ని నింపి త్వరగా పెళ్లి జరిగేలా చేస్తుంది’ అని సూచిస్తున్నారు.