News January 18, 2026

మేడ్చల్: అన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్ల సీట్లు మహిళకే..!

image

మేడ్చల్ జిల్లాలో మున్సిపాలిటీలకు సంబంధించి ఛైర్ పర్సన్ సీట్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అలియాబాద్ పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఛైర్మన్ సీటు ఎస్సీ జనరల్‌ మహిళకు రిజర్వ్ చేశారు. అలాగే.. ఎల్లంపేట మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News January 26, 2026

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా గణతంత్ర వేడుకలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, అన్ని మండలాల తహసిల్దార్ కార్యాలయాల్లో ఎమ్మార్వోలు, పోలీస్ స్టేషన్లలో ఎస్సైలు జెండా ఆవిష్కరించారు. మండల పరిషత్‌లో ఎంపీడీవోలు, గ్రామ పంచాయతీల్లో సర్పంచులు జాతీయ జెండా ఎగరవేశారు. అంతకు ముందు మహనీయుల చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు నివాళులర్పించారు.

News January 26, 2026

KNR: TNGOs భవన్లో ఘనంగా గణతంత్ర వేడుకలు

image

కరీంనగర్ TNGOs భవన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TNGOs జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, సేవాభావంతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TNGOs నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

News January 26, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ₹2,450 పెరిగి రూ.1,62,710కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ₹2,250 ఎగబాకి రూ.1,49,150 పలుకుతోంది. అటు KG సిల్వర్ రేటు రూ.10వేలు పెరిగి రూ.3,75,000గా ఉంది. 10 రోజుల్లోనే వెండి ధర ₹69వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.