News January 18, 2026
పెద్దపల్లి: ‘మున్సిపల్ ఎన్నికల్లో గౌడలకు 4 సీట్లు కావాలి’

మున్సిపల్ ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించే పార్టీకే మద్దతు ఇస్తామని పెద్దపల్లి గౌడ సంఘాల జేఏసీ నాయకులు ప్రకటించారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో గౌడలకు 10 వేలకుపైగా ఓటర్లు ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. 36 వార్డుల్లో కనీసం 4 సీట్లు గౌడలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Similar News
News March 6, 2026
అనంతపురం జిల్లాపై YS జగన్ ఫోకస్

అనంతపురం జిల్లాలో పార్టీ బలోపేతానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఈ మేరకు నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. గుంతకల్లు-లింగాల శివశంకర్ రెడ్డి, రాయదుర్గం-బత్తల హరి ప్రసాద్, తాడిపత్రి-అత్తార్ చాంద్‌బాషా, కళ్యాణదుర్గం-ఎం.మహేంద్రనాథ్ రెడ్డి, ఉరవకొండ-కే.రమేశ్ రెడ్డి, శింగనమల-ఎల్ఎం మోహన్ రెడ్డి, అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిశీలకుడిగా బోయ తిప్పేస్వామి నియమితులయ్యారు.
News March 6, 2026
‘పోలవరం’ ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం.. CMకు ఉండవల్లి బహిరంగ లేఖ

పోలవరం ప్రాజెక్టులోని లోపాలపై హెచ్చరిస్తూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం గ్యాప్-2 ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వ్యత్యాసాలను చెబుతూ పూర్తిస్థాయి డిజైన్‌కు ఆమోదం లేకుండా పనులు చేయడం ప్రమాదకరమని ఉండవల్లి అన్నారు. ఆనకట్ట పునాది స్థాయిలో వ్యత్యాసం ఉండటం వల్ల స్థిరత్వం దెబ్బతింటుందని, పునాది కింద ఇసుక కోతకు గురైతే పోలవరం డేంజర్‌లో పడుతుందని హెచ్చరించారు.
News March 6, 2026
కూలిన సుఖోయ్.. ధర ఎంత ఉంటుందంటే?

సుఖోయ్ ఫైటర్ జెట్ Su-30MKI నిన్న శిక్షణ సమయంలో అస్సాంలోని జోర్హట్‌కు 60KM దూరంలో కూలినట్లు ఇండియన్ ఫోర్స్ ధ్రువీకరించింది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పింది. అయితే యుద్ధ విమానం ధర ఎంత ఉంటుందనే చర్చ జరుగుతోంది. గతేడాది భారత్ 12 ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చి రూ.13,500CR కేటాయించింది. దాని ప్రకారం ఒక్కో Su-30MKI రూ.1,000కోట్లకు పైగా ఉంటుంది. ప్రస్తుతం IND వద్ద 260+ సుఖోయ్ జెట్లు ఉన్నాయి.


