News January 19, 2026

తూ.గో: నేడు కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్

image

జనవరి 19న కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్, PGRS యథావిధిగా నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భూ సంబంధిత ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ వేదికను ఉపయోగిస్తున్నామన్నారు. భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News March 24, 2026

మెగా ఫ్యామిలీ నుంచి స్పెషల్ పిలుపు.. బాబికి కీలక పదవి

image

రాజమండ్రికి చెందిన ఏడిద బాబి Mega Youth Force జాతీయ కన్వీనర్‌గా నియమితులయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రొడ్యూసర్ కొణిదెల సుస్మిత నుంచి ఆయన నియామక పత్రం అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని బాబి వెల్లడించారు. తనపై ఉంచిన నమ్మకానికి నూరు శాతం న్యాయం చేస్తానని పేర్కొన్నారు. రాజమండ్రి నుంచి జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

News March 23, 2026

పోలీస్ PGRSకు ఫిర్యాదుల వెల్లువ

image

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని SP డి.నరసింహ కిషోర్ నిర్వహించారు. బాధితుల నుంచి 47 ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, చట్ట పరిధిలో త్వరితగతిన సమస్యలను పరిష్కరించి సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా SP స్పష్టం చేశారు.

News March 23, 2026

దొమ్మేటి జయంతి.. SP నరసింహ కిషోర్ నివాళి

image

తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. SP నరసింహ కిషోర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభివృద్ధికి, విద్యకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. దొమ్మేటి సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిందని SP పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.