News January 19, 2026
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్ వెట్రిసెల్వి

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా సోమవారం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, డివిజన్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించి ఫిర్యాదుల స్థితిని, తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.
Similar News
News February 18, 2026
గద్వాల: రేపటి నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు

ఈ రోజు నెలవంక దర్శనం ఇవ్వడంతో ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలో రేపటి ఉపవాస వేళలు ఇలా ఉన్నాయి.
సహెరి 5:20
ఇఫ్తార్ 6:25
మొదటి రోజు సుమారు 13 గంటల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.
నోట్: ప్రాంతాలను బట్టి వేళలు కొన్నినిమిషాలు మారొచ్చు.
News February 18, 2026
సేవాలాల్ జయంతి ఘనంగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సేవాలాల్ జయంతి ఏర్పాట్లపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 20న ఖానాపూర్‌లో నిర్వహించనున్న జయంతి వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. జయంతి వేడుకలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
News February 18, 2026
AI కనెక్టివిటీకి భారత్‌కు గూగుల్ సబ్‌సీ కేబుల్స్

AI రంగంలో భారత్ అసాధారణ వృద్ధిని సాధిస్తుందని గూగుల్ CEO సుందర్ పిచాయ్ ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’లో పేర్కొన్నారు. భారత్-US మధ్య AI కనెక్టివిటీని పెంచేందుకు సబ్‌సీ కేబుల్ ప్రాజెక్టును ప్రకటించారు. $15 బిలియన్ల AI హబ్ ద్వారా భారత్‌లో భారీగా మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. భారత విద్యార్థుల కోసం హిందీ, ఇంగ్లీష్‌లో ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు గుర్తుచేశారు.


