News January 19, 2026
నేడు దావోస్‌కు CM రేవంత్

TG: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు నేడు సీఎం రేవంత్ దావోస్ వెళ్లనున్నారు. మేడారంలో మహాజాతరను ప్రారంభించాక ఉ.8 గం.కు హెలికాప్టర్‌లో HYD చేరుకుంటారు. ఉ.9.30గం.కు శంషాబాద్ నుంచి CM, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు పర్యటనకు వెళ్లనున్నారు. గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలివర్, లోరియల్, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి సంస్థల అధినేతలతో రేవంత్ భేటీ అవుతారు.
Similar News
News February 13, 2026
టుడే టాప్ స్టోరీస్

* 2029లో జమిలి ఎన్నికలు: సీఎం రేవంత్
* నేను ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదు: సీఎం రేవంత్
* ఒక్క ఐటీ జాబ్‌తో ఆరుగురికి ఉపాధి: మంత్రి లోకేశ్
* లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్
* రేపే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
* నమీబియాపై భారత్ ఘన విజయం
* స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
News February 13, 2026
నేతల కుటుంబాలతో లోకేశ్ ఆత్మీయ కలయిక

AP: మంత్రి నారా లోకేశ్ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. మచిలీపట్నం పార్లమెంటు ప్రజాప్రతినిధులు, వారి కుటుంబాలతో ఉండవల్లిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, MLAలు యార్లగడ్డ, కృష్ణప్రసాద్, బుద్ధ ప్రసాద్, వర్లకుమార్, బోడే ప్రసాద్, చీఫ్ విప్ ఆంజనేయులు కుటుంబసభ్యులను ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి విందు చేశారు. ఈ సందర్భంగా నేతల సతీమణులకు మంగళగిరి పట్టుచీరలు అందజేశారు.
News February 13, 2026
‘జైలర్-2’ రిలీజ్ డేట్ అదేనా?

రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘జైలర్’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘జైలర్-2’ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 21న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, శివ రాజ్ కుమార్, మోహన్‌లాల్ తదితరులు నటిస్తున్నారు. షారుఖ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.


