News January 19, 2026
భీమవరం వన్‌టౌన్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్) వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరు కార్యాలయానికి బదులుగా ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరగనుంది. ఈ మార్పును గమనించి, అర్జీదారులు నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి తమ విన్నపాలను అందజేయాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.
Similar News
News February 4, 2026
తణుకు: పోలీసులపై ఏసీబీ విచారణ?

తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బారావు రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైటర్ వెనుక ఉన్న సూత్రధారులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇప్పటికే CI పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ DSP కృష్ణారావు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
News February 4, 2026
రబీ సాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

రబీ పంటకు సాగునీటి సరఫరాలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఇరిగేషన్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. సాగునీటి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని క్షేత్రస్థాయి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.