News January 19, 2026
HYD: ఎక్కడ పడితే అక్కడ సిమ్‌లు కొంటున్నారా?

సిమ్ కార్డులు విక్రయిస్తున్న అంతరాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాకు చెందిన దినేష్, సాయిప్రదీప్ నిబంధనలకు విరుద్ధంగా సిమ్ కార్డులను అమ్ముతూ మోసాలు చేస్తున్నారు. సిమ్ కోసం వచ్చిన వారి వేలిముద్రలతో మరికొన్ని సిమ్‌లు యాక్టివేట్ చేసుకుని డ్రగ్స్ ముఠాలు, సైబర్ నేరస్థుకు అమ్ముతున్నారు. దీంతో సీసీఎస్ స్పెషల్ టీమ్ వీరిని అదుపులోకి తీసుకొని 184 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News February 10, 2026
HYD: కాగితాల్లో తగ్గుదల.. వాడల్లో జ్వరాల హోరు!

HYDలో డెంగ్యూ తగ్గిందని సర్కార్ లెక్కలు చెబుతున్నా గల్లీల్లో జనం జ్వరాలతో మంచం పడుతున్నారు. 2024లో 2,806గా ఉన్న కన్ఫర్మ్డ్ డెంగ్యూ కేసులు 2025లో 1,976కు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. అయితే, 2021లో 220గా ఉన్న సస్పెక్టెడ్ చికెన్ గున్యా కేసులు 2025 నాటికి ఏకంగా 13,500 దాటి 60 రెట్లు పెరిగాయని అధికారిక నివేదికలు తెలుపుతున్నాయి. 2026 ప్రారంభంలోనే <<19102369>>కోరంటిలో OP<<>> రోజుకు 700 దాటడం గమనార్హం.
News February 10, 2026
HYD: మూసీ తీరాన ‘దోమల’ ఘోష!

మూసీ ప్రక్షాళన సంగతేమో కానీ.. దోమల సంతతి మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 2024లో మూసీ పరీవాహక ప్రాంతాల్లో 450 మలేరియా కేసులు నమోదవ్వగా 2025 ముగిసేసరికి ఆ సంఖ్య 700 దాటేసింది. అధికారులు డ్రోన్లతో మందులు చల్లుతున్నామని చెబుతున్నా గుర్రపుడెక్క ముందు అవేవీ పనిచేయడం లేదు. సాయంత్రం 6 దాటిందంటే చాలు కిటికీలు తెరిస్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ఏటా రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా దోమలు తగ్గడం లేదు.
News February 10, 2026
HYD: కొత్త కమిషనరేట్లు.. వీరే బాధ్యులు..!

* కమిషనర్ కర్ణన్ టీంలో అనురాగ్ జయంతి, ప్రియాంక ZCలుగా అందుబాటులో ఉంటారు. మీ ఏరియాలో ఎలాంటి సమస్యలున్నా 7993425555కు కాంటాక్ట్ అవ్వొచ్చు.
* వినయ్ కృష్ణారెడ్డి టీంలో ZCలుగా సాంచిత్ గంగ్వార్, రాధికా గుప్తా వ్యవహరిస్తారు. మీ ఏరియాలో ఎలాంటి సమస్యలున్నా 9063421145కు కాల్ చేయొచ్చు.
* సృజన టీంలో భోకాడే హేమంత్, అపూర్వ్ చౌహాన్, సందీప్ కుమార్ ZCలుగా ఉంటారు. ఎలాంటి సమస్యలున్నా 8008011110కు కాంటాక్ట్ కావచ్చు.


