News January 19, 2026
కామారెడ్డి: జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి ప్రభావం తీవ్రమవుతోంది. సోమవారం ఉదయం నమోదైన గణాంకాల ప్రకారం జిల్లాలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 10.8°Cగా నమోదైంది. ముఖ్యంగా మాచారెడ్డి (లచ్చపేట)లో 12.3°C, జుక్కల్‌లో 12.3°C, గాంధారి (రామలక్ష్మణపల్లి)లో 12.8°C, ఎల్లారెడ్డి (మాచాపూర్)లో 13.7°C, దోమకొండలో 13.7°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News March 11, 2026
లక్షెట్టిపేట: వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి

లక్షెట్టిపేటలోని కొత్త ఫ్లాట్లకు చెందిన లకావత్ గణేష్(45) వడదెబ్బతో మృతి చెందాడని ఏఎస్ఐ అన్వర్ హుస్సేన్ తెలిపారు. వడదెబ్బ తగిలిందని గణేష్ మంగళవారం కొడుకు రాజేశ్వర్‌ను రూ.20 అడిగి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. బుధవారం ఇటిక్యాల చెరువు వద్ద గణేష్ శవం ఉందని స్థానికులు చెప్పడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. గణేష్ చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లి వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు ఏఎస్ఐ వెల్లడించారు.
News March 11, 2026
సిద్దిపేట: మధ్యాహ్న భోజనంపై కలెక్టర్ అసహనం

కోహెడ మండలం శనిగరంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ కె. హైమావతి బుధవారం సందర్శించారు. మధ్యాహ్న భోజనంలో పప్పు పలుచగా ఉండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం తంగళ్లపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థుల భోజనం, వసతి, చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
News March 11, 2026
KNR: ‘డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి’

డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి అలవాట్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, అడిషనల్ డీసీపీ వేంకటరమణ తెలిపారు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు విడుదల చేసిన కరపత్రాన్ని వారు KNRలో ఆవిష్కరించారు. మత్తు పదార్థాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ తదితరులు ఉన్నారు.


