News April 26, 2024

KMM: నామినేషన్ విత్ డ్రా చేసుకున్న రాయల

image

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశానుసారం తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నానని రాయల నాగేశ్వరరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

Similar News

News November 26, 2024

‘ఉచిత కోచింగ్ కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి’

image

విదేశాలకు వెళ్లి చదవాలనుకునే మైనార్టీ విద్యార్థుల కోసం IELTS, GRE, TOFEL పరీక్షలకు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు. ఆసక్తి, అర్హత గల జిల్లా మైనార్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30 లోపు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 26, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు ∆} పాల్వంచ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పినపాక నియోజకవర్గం లో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన ∆} పలు శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} బయ్యారంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

News November 26, 2024

ఖమ్మం: డిగ్రీ పరీక్షల రీ షెడ్యూల్ 

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. బీఏ, బీకాం, బీబీఏ, బీఏసీ తదితర కోర్సుల మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26న ఉండగా వాటిని డిసెంబర్ 27కు రీ షెడ్యూల్ చేశారు. మూడో సెమిస్టర్ ఈ నెల 27న ఉండగా డిసెంబర్ 28కి మార్చారు. నవంబర్ 28న జరిగే పరీక్షను డిసెంబర్ 30న నిర్వహించనున్నట్లు కేయూ అధికారులు తెలిపారు. మిగతావి యథావిధిగా కొనసాగుతాయన్నారు.