News January 19, 2026

ఖమ్మం జిల్లాలో 27 గ్రామాల్లో ‘సౌర’ వెలుగులు!

image

ఖమ్మం జిల్లాలో విద్యుత్ స్వయం సమృద్ధి లక్ష్యంగా 27 గ్రామాలను ‘మోడల్ సోలార్ విలేజ్’లుగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బోనకల్, నేలకొండపల్లి, ఎన్కూరు, రఘునాథపాలెం, వైరా మండలాల్లో 16,837 ఇళ్లకు, 4,371పంపుసెట్లకు రెడ్-కో ద్వారా ఉచిత సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు రావినూతలలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

Similar News

News January 30, 2026

కల్లూరు: స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్

image

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఫిబ్రవరి 11న 20 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్ట్రాంగ్ రూములను బ్యాలెట్ బాక్స్‌లను స్టేట్ ఎన్నికల అబ్జర్వర్ పవన్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై సలహాలు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, మేనేజర్ నాగేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.

News January 30, 2026

ఖమ్మం: బాక్సింగ్‌లో ‘రూప’ మెరుపు

image

నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెం గురుకుల కళాశాల విద్యార్థిని వి.రూప బాక్సింగ్‌లో సత్తా చాటింది. హైదరాబాద్‌లో జరిగిన అండర్-19 రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఫిబ్రవరిలో కర్ణాటకలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రూప ఎంపికైంది. ప్రతిభ చాటిన రూపను ప్రిన్సిపాల్ శ్రీలత, క్రీడా విభాగం సిబ్బంది ఘనంగా అభినందించారు.

News January 30, 2026

ఖమ్మం: ధీమాతో నామినేషన్.. టికెట్ కోసం టెన్షన్ !

image

ఖమ్మం జిల్లాలో 2వ రోజు 309 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నేతలు గెలుపు గుర్రాల వేటలో ఉండగా.. టికెట్ వస్తుందన్న ధీమాతో కొందరు, నేతలహామీతో మరికొందరు నామినేషన్లు సమర్పిస్తున్నారు. కాగా టికెట్ దక్కుతుందో లేదోనని పలువురు ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. టికెట్ దక్కని వారు పక్క పార్టీ నేతలలో సంప్రదింపులు జరుపుతున్నారు.