News January 19, 2026

పెద్దపల్లి: సర్పంచ్‌ల ‘శిక్షణ’ షురూ

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లకు 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాలకు మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. సోమవారం కమాన్‌పూర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, పాలకుర్తి, కాల్వ శ్రీరాంపూర్ మండలాల సర్పంచ్‌లు శిక్షణా కేంద్రానికి హాజరయ్యారు.

Similar News

News January 29, 2026

వరంగల్: టార్గెట్ కడియం శ్రీహరి..!

image

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ తిరిగి బీఆర్ఎస్‌లో చేరిక పట్ల ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చ ప్రారంభమైంది. ఆయన చేరిక కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ జరిగినట్లు కనిపిస్తోంది. ఎర్రబెల్లి, అరూరి మాటలు సైతం శ్రీహరి పేరును ఉచ్చరిస్తూ కనిపించాయి. స్టేషన్‌ఘన్‌పూర్ బై ఎలక్షన్ వచ్చే సూచనలతో అరూరిని అక్కడి నుంచి పోటీ చేసేందుకే మళ్లీ పార్టీలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు మాట్లాడుతున్నాయి. మీ కామెంట్..!

News January 29, 2026

మొక్కజొన్న పంటలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

మొక్కజొన్న పైరు ఒకవేళ 60 నుంచి 65 రోజుల దశలో ఉంటే పంటకు అవసరం మేర ఎరువులను అందించాలి. ఈ సమయంలో చివరి దఫా నత్రజని ఎరువుగా ఎకరాకు 50 కిలోల యూరియా మరియు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలి. పూత దశకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో పైరుకు నీటి తడులను తప్పనిసరిగా అందించాలి. నేల స్వభావం బట్టి 10-15 రోజుల వ్యవధిలో నీటిని అందించకుంటే పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది.

News January 29, 2026

చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్‌లో సెక్షన్ 163

image

మున్సిపల్ ఎన్నికలు జరిగే చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్ పరిధిలో సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. ఈ సెక్షన్ 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రజలు గుమి కూడి ఉండకూడదని సూచించారు. ప్రాణాంతక ఆయుధాలు చేతిలో పట్టుకోవడం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయన్నారు.