News January 19, 2026
మాస్టర్‌చెఫ్ ఇండియాలో మెరిసిన ‘HYD ఫైర్ పాన్ వాలా’

భాగ్యనగరపు అద్భుతమైన ఆహార వైభవం మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తన విభిన్నమైన శైలితో HYD వీధుల్లో ‘ఫైర్ పాన్ వాలా’గా గుర్తింపు పొందిన హుస్సేన్, ప్రముఖ కుకింగ్ రియాలిటీ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 9’లో అడుగుపెట్టారు. వేల రకాల పాన్‌లను తయారు చేయడంలో రికార్డు సృష్టించిన హుస్సేన్, వీల్‌చైర్‌కే పరిమితమైనా తన ఆత్మవిశ్వాసంతో మాస్టర్‌చెఫ్ వేదికపై జడ్జీలను ఆశ్చర్యపరిచారు.
Similar News
News February 11, 2026
HYDలో Low-Budget పార్టీ ఇదే!

సాయంత్రం 6 దాటిందంటే చాలు మన HYD కుర్రాళ్లది ఒక సెపరేట్ లోకం. పబ్బులు, డిస్కోలు కాదు బాసూ.. మెట్రో కింద చాయ్ బండ్లు, చెరువు గట్టు మీద బెంచీలే వీళ్ల అడ్డాలు. గట్టిగా మ్యూజిక్ ఉండదు, స్ట్రోబ్ లైట్లు అసలే ఉండవు. జస్ట్ ఫ్రెండ్స్‌తో కలిసి ఒక ప్లేలిస్ట్ వినడం, ముచ్చట్లు, వీలైతే ఒక రీల్ ప్లాన్ చేసుకోవడం.. అంతే. ఇంట్లో వాళ్లకు “చాయ్ తాగి వస్తా” అని చెబుతారు.. కానీ వీరికి ఇది ఒక లో-బడ్జెట్ పార్టీ లాంటిదే.
News February 11, 2026
EXIT POLLS.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇలా..!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 4 నుంచి 6 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 2 నుంచి 3 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.
News February 11, 2026
Peoples Pulse.. ఉమ్మడి రంగారెడ్డి ఎగ్జిట్ పోల్స్ ఇవే!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీలకు సంబంధించి 294 వార్డుల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 104-112 వార్డులు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BRS 95-104, BJP 16-18, MIM 2-3, CPM 2-3, ఇతరులు 6-8 వార్డులు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.


