News January 19, 2026

మున్సిపల్ ఎన్నికలకు నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్‌గా ఉత్తమ్ కుమార్

image

రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో రాష్ట్రంలో గడువు పూర్తైన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 18, 2026

నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమకు ఏర్పాటు సన్నాహాలు

image

జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం నిజామాబాద్ పట్టణంలో అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాకు ఆయిల్ పరిశ్రమ మంజూరు చేసేందుకు CM రేవంత్ రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారని అన్నారు. అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.

News March 17, 2026

NZB: హనుమాన్ జయంతి వేడుకల అనుమతి ఇవ్వాలి: VHP

image

ఏప్రిల్ 2న జిల్లాలోని NZB, బోధన్, ఆర్మూర్‌లలో నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకలకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకులు కోరారు. NZB CP సాయి చైతన్యను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో VHP విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ప్రాంత గోరక్ష కృషి సంపర్క ప్రముఖ్ దాత్రిక రమేశ్, హిందూవాహిని జిల్లా సంయోజక్ దాసరి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

News March 17, 2026

NZB: అధ్యాపకులను రిలీవ్ చేయకుంటే చర్యలు: DIEO

image

ఈనెల 18 నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్ మూల్యాంకనం అధ్యాపకులను రిలీవ్ చేయాలని, ఎవరైనా రిలీవ్ చేయని ప్రిన్సిపల్‌లు, ప్రైవేటు యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని NZB DIEO రవి కుమార్ హెచ్చరించారు. సంబంధిత కళాశాల లాగిన్‌లలో మూల్యాంకన విధుల్లో ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ సబ్జెక్టు అధ్యాపకుల అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇంటర్ బోర్డు నిక్షిప్తం చేసిందన్నారు.