News January 19, 2026
మాఘ మాసంలో చేయాల్సిన పుణ్య కార్యాలు

మాఘమాసం పుణ్యకార్యాలకు, దానధర్మాలకు పెట్టింది పేరు. ఈ నెలలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఆచరిస్తే జన్మజన్మల పాపాలు పోతాయని పురాణాల వాక్కు. రోజూ మాఘపురాణ పఠనం, విష్ణుసహస్రనామాలు స్మరించడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. నువ్వులు, వస్త్రాలు, అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో చేసే పుణ్య కార్యాలతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అంటున్నారు.
Similar News
News February 23, 2026
ఇండియా ఫైనల్ మ్యాచ్‌కు జగన్‌కి టికెట్ కొంటా: లోకేశ్ సెటైర్

AP: T20 WCలో ఇండియా ఫైనల్‌కి వెళ్తుందని, ఆ మ్యాచ్‌కి తనతోపాటు పులివెందుల MLA జగన్‌కు టికెట్ కొంటానని మంత్రి లోకేశ్ సెటైర్ వేశారు. IND-PAK మ్యాచ్‌కు <<19184657>>తాను వెళ్లడం<<>>పై YCP విమర్శలకు అసెంబ్లీ ఆవరణలో కౌంటరిచ్చారు. తనకు దేశభక్తి ఉందని, మనవాళ్లు ఎక్కడ మ్యాచ్ ఆడినా వెళ్తానని అన్నారు. హెరిటేజ్ ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వ నిధులు రూపాయి కూడా ఆ సంస్థకు మళ్లించలేదని స్పష్టంచేశారు.
News February 23, 2026
116 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 23, 2026
ఆయన వల్లే మళ్లీ నాలో మార్పు: సమంత

డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో తన వివాహ బంధం గురించి హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో నేను విడిపోయినప్పుడు ఇంకొకరిపై ఆధారపడటం సాధ్యమవుతుందని అనుకోలేదు. అదృష్టవశాత్తూ ప్రేమ, స్నేహాన్ని అంగీకరించేంత బలహీనంగా మారిపోయా. నేనున్న రిలేషన్‌షిప్ వల్ల బెటర్‌గా మారిపోయా. రాజ్ నిడిమోరు వల్లే ఇది సాధ్యమైంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌లో రాజ్, సమంత ఒక్కటయ్యారు.


