News January 19, 2026

కొత్త ట్రెండ్.. పదేళ్లలో ANY CHANGE?

image

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘2016 Vs 2026’ ఛాలెంజ్ తెగ ట్రెండ్ అవుతోంది. పదేళ్ల కాలంలో తమ రూపం ఎంతలా మారిందో చూపేలా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ పాత, కొత్త ఫొటోలతో పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా సినీ తారల మేకోవర్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు కరీనా, అనన్య, సోనమ్ కపూర్ సైతం వారి ఓల్డ్ ఫొటోస్ షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ ట్రెండ్‌ను మీరూ ట్రై చేశారా?

Similar News

News February 10, 2026

జైలుకి వెళ్లడానికైనా సిద్ధమే: అస్సాం సీఎం

image

హైదరాబాద్‌లో తనపై అసదుద్దీన్‌ ఒవైసీ ఫిర్యాదు చేయడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. బంగ్లాదేశ్‌ చొరబాట్లపై తాను చేసిన పోస్టుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ‘నేను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే’ అని పేర్కొన్నారు. కాగా మతపరంగా ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ హిమంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

News February 10, 2026

ఢిల్లీ చేరిన సీఎం.. రేపు కేంద్రమంత్రులతో భేటీ

image

AP: సీఎం చంద్రబాబు కాసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు వెళ్లిన ఆయనకు టీడీపీ ఎంపీలు ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో వారితో కొద్దిసేపు సమావేశమయ్యారు. అదే సమయంలో అక్కడే ఉన్న దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం 1 జన్‌పథ్‌లోని తన నివాసానికి వెళ్లారు.

News February 10, 2026

కెనడాపై సౌత్ ఆఫ్రికా ఘన విజయం

image

T20 WC: సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్‌లో కెనడా తేలిపోయింది. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. అటు బౌలింగ్‌ ఇటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. ధాలీవాల్(64), హర్ష్(33) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి పాలైంది. SA జట్టు 57 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, మార్కో జాన్సన్ 2, రబాడా, బోష్ చెరో వికెట్ తీశారు.