News January 19, 2026
అన్నమయ్య: ఇందులో మీ ల్యాప్‌టాప్ ఉందా?

అన్నమయ్య జిల్లాలో ల్యాప్‌టాప్ దొంగ నరేశ్‌ను <<18897096>>అరెస్ట్ <<>>చేసిన విషయం తెలిసిందే. నిందితుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఖర్చుల కోసం రెండేళ్లుగా తిరుపతి-బెంగళూరు, రాయచోటి-బెంగళూరు బస్సుల్లో దొంగతనాలు చేస్తున్నాడు. పోలీసులు అరెస్ట్ చేసి అతని ఇంట్లో సోదాలు చేశారు. 23 ల్యాప్‌టాప్‌లు దొరికాయి. మీలో ఎవరిదైనా ల్యాప్‌టాప్ పోయినట్లైతే సంబంధిత ఆధారాలను సంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో చూపించి వీటిని తీసుకోవచ్చు.
Similar News
News February 20, 2026
VZM: మద్యానికి బానిసైన వ్యక్తి అత్మహత్య

మద్యానికి బానిసైన భర్తను భార్య మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరంలో జరిగింది. 1టౌన్ ఎస్ఐ ఎస్సై అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన బెవర శ్రీనివాస్(28) కూలీ పనులు చేస్తు జీవనం సాగించేవాడు. మద్యానికి బానిస కావడంతో ఆయన భార్య రేవతి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై శ్రీనివాస్ గురువారం ఇంట్లో ఉరేసుకొన్నాడు. మృతుడుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News February 20, 2026
సిద్ధిపేటలో నేడే మెగా సెమినార్.. పేరెంట్స్ మీకోసమే!

పదో తర్వాత విద్యార్థులు ఎలాంటి మార్గం వైపు వెళ్తే మంచి భవిష్యత్ ఉంటుందనే దానిపై తల్లిదండ్రులు స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత కెరీర్ గైడెన్స్ సెమినార్లు నిర్వహిస్తున్నాయి. సిద్ధిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఇవాళ సాయంత్రం.6 గంటలకు సదస్సు జరగనుంది. CBI Ex జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. సో పేరెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
News February 20, 2026
నేను సంపాదిస్తాను.. నువ్వు క్రికెట్ ఆడు: వరుణ్ చక్రవర్తి లవ్ స్టోరీ

టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సక్సెస్ వెనక భార్య నేహా ఖేడేకర్ త్యాగం మరువలేనిది. వీరిద్దరి లవ్‌స్టోరీ SRM వర్సిటీలో మొదలైంది. ఆర్కిటెక్ట్ జాబ్ వదిలేసి క్రికెట్ వైపు వెళ్లాలని వరుణ్ అనుకున్నప్పుడు నేహ కొండంత అండగా నిలిచారు. ‘నీకు జాబ్ లేకపోయినా ఫర్వాలేదు. నేను సంపాదిస్తాను. నువ్వు క్రికెట్ ఆడు’ అని ధైర్యమిచ్చారు. భవిష్యత్తుపై భరోసా లేక తనను వివాహం చేసుకోవద్దని వరుణ్ చెప్పినా ఆమె వినలేదట.


