News January 19, 2026
ఇతిహాసాలు క్విజ్ – 128 సమాధానం

ప్రశ్న: అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలిసినా, బయటకు రావడం ఎందుకు తెలియదు?
సమాధానం: అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే విధానం గురించి వివరిస్తుంటే విన్నాడు. అయితే, వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గాన్ని చెప్పే సమయానికి సుభద్ర నిద్రపోయింది. దీంతో గర్భంలో ఉన్న అభిమన్యుడికి లోపలికి వెళ్లడం మాత్రమే తెలిసింది. బయటకు రావడం తెలియలేదు.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News February 23, 2026
యూనస్ కుట్రలు చేశారు.. బంగ్లా అధ్యక్షుడి ఆరోపణలు

బంగ్లా మాజీ అడ్వైజర్ యూనస్‌పై దేశాధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ సంచలన ఆరోపణలు చేశారు. తనను రాజ్యాంగ విరుద్ధంగా పదవి నుంచి తొలగించేందుకు కుట్రలు చేశారని చెప్పారు. ‘దేశాన్ని అస్థిరపరిచేందుకు యూనస్ ప్రయత్నించారు. దేశ శాంతి భద్రతలను శాశ్వతంగా నాశనం చేయాలని చూశారు’ అని ఓ ఇంటర్వ్యూలో విమర్శించారు. ఏడాదిన్నర కాలంలో తనను ప్యాలెస్ ఖైదీగా మార్చారని, 2 విదేశీ పర్యటనలను అడ్డుకున్నారని వాపోయారు.
News February 23, 2026
తేజస్ జెట్ కూలినట్లు వార్తలు.. స్పందించిన HAL

స్వదేశీ యుద్ధ విమానం ‘LCA తేజస్’ కూలినట్లు వస్తున్న వార్తలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) ఖండించింది. జెట్ కూలిపోలేదని, చిన్న సాంకేతిక లోపం తలెత్తిందని తెలిపింది. లోపాన్ని లోతుగా విశ్లేషిస్తున్నామని, వేగంగా సరిచేసేందుకు IAFతో కలిసి పని చేస్తున్నామని వెల్లడించింది. ప్రపంచంలో అత్యుత్తమ భద్రతా రికార్డులు కలిగిన యుద్ధ విమానాల్లో తేజస్ ఒకటని పేర్కొంది. ఈ ఫైటర్ జెట్లను HAL తయారు చేస్తోంది.
News February 23, 2026
రోల్డ్‌గోల్డ్ నగలు ఎక్కువకాలం మన్నాలంటే..

నగలంటే ప్రతి మహిళకూ ప్రత్యేకమే. కానీ రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలతో నగలు కొనడం కష్టమవుతోంది. దీంతో గిల్టు నగలు కొనడం ఎక్కువైంది. అయితే వీటిని సరిగ్గా సంరక్షించకపోతే త్వరగా పాడైపోతాయి. అందుకే వీటిని నీటికి దూరంగా ఉంచాలి. చర్మంపై మేకప్, మాయిశ్చరైజర్, పర్ఫ్యూమ్‌లు, లోషన్లు, డియోడరెంట్లు వాడే ముందు గిల్టు నగలను తీసేయాలి. వీటి కెమికల్స్ వల్ల వాటి కోటింగ్ పోతుంది. ఎయిర్‌టైట్ పౌచ్‌లో భద్రపరచాలి.


