News January 19, 2026
అనంతపురం: 54 మంది జడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు

అనంతపురం జిల్లా పరిషత్ పరిధిలోని 54 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ జడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి, వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని దిశానిర్దేశం చేశారు. జడ్పీ సీఈఓ శివ శంకర్, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 27, 2026
అనంతపురంలో ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ

అనంతపురం రూడ్ సెట్ సంస్థలో వచ్చే నెల 2 నుంచి 30 రోజుల పాటు నిరుద్యోగ పురుషులకు ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి గురువారం తెలిపారు. 18-50 ఏళ్ల లోపు గ్రామీణ నిరుద్యోగ యువకులు ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితమని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అనంతపురం రూడ్ సెట్ కార్యాలయన్ని సంప్రదించాలన్నారు.
News March 26, 2026
గర్భస్థ లింగ నిర్ధారణపై కలెక్టర్ హెచ్చరిక

అనంతపురంలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఓ.ఆనంద్ హెచ్చరించారు. పీసీ-పీఎన్‌డీటీ చట్టం అమలుపై సమీక్షిస్తూ స్కానింగ్ సెంటర్లపై కఠిన నిఘా ఉంచాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.