News January 19, 2026
సైబర్ నేరగాళ్ల APK లింకులతో జాగ్రత్త

గుర్తుతెలియని వ్యక్తులు పంపే APK ఫైల్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని DIG, జిల్లా ఇన్‌ఛార్జి SP విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఇలాంటి ఫైళ్లు ఇన్‌స్టాల్ చేస్తే వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు బ్యాంకింగ్ యాప్‌లు కూడా హ్యాక్ అయ్యే ప్రమాదముందని వివరించారు. ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే ఫ్లైట్ మోడ్‌లో పెట్టి సైబర్ ల్యాబ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Similar News
News February 2, 2026
ప్రజా ఫిర్యాదుల వేదికకు 125 ఫిర్యాదులు: ఎస్పీ

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం కొత్తపేటలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కు 125 అర్జీలు అందాయి. ఉద్యోగాల పేరుతో మోసాలు, ఆన్‌లైన్ నగదు దోపిడీలు, కుటుంబ వేధింపులపై బాధితులు స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అర్జీదారుల సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ, ఆయా సమస్యలపై తక్షణమే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
News February 2, 2026
కూటమి పాలనపై కేంద్రం స్పందించాలి: ఎస్వీ మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దాడులు, అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారితే దాడులకు పాల్పడిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
News February 2, 2026
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: కర్నూలు కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. కలెక్టర్ సిరి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో వచ్చే ప్రజల అభ్యర్థనలను అధికారులు బాధ్యతతో పరిశీలించాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోపు అర్జీలను నాణ్యతతో పరిష్కరించి వారి నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


