News January 19, 2026

ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్

image

స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ భారత్ యాత్ర’ వాహనం 9వ రోజు సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకుంది. ఈ వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, తడి-పొడి చెత్త ఏర్పాటు, వ్యర్థాల నుంచి వస్తువుల తయారీ విధానాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన వీక్షించారు.

Similar News

News February 3, 2026

నేడు ఏపీ కేబినెట్ భేటీ

image

AP: రాష్ట్ర కేబినెట్ భేటీ ఈరోజు జరగనుంది. ఉదయం 10:30 గంటలకు అమరావతి సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో మంత్రులు భేటీ కానున్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతోపాటు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. FEB 11వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. 14వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో పెడతారు.

News February 3, 2026

వికారాబాద్: 100 స్థానాలు.. బరిలో 506 మంది

image

జిల్లాలో 100 కౌన్సిలర్ స్థానాలకు గానూ ఆయా పార్టీల నుంచి 506మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం కూడా పలు పార్టీల అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ నుంచి పరిగి 1, తాండూర్ 2, వికారాబాద్ 1, BRS నుంచి తాండూర్ 1, వికారాబాద్ 2, పరిగి 2, కొడంగల్ 1, ఎంఐఎం పార్టీ తరఫున వికారాబాద్లో ఒక నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఉంది.

News February 3, 2026

ఉప్పు వేయడం, వేర్లు నరకడం వల్ల కొబ్బరి దిగుబడి పెరుగుతుందా?

image

చాలా చోట్ల కొబ్బరి సాగు చేస్తున్న రైతులు చెట్లకు ఉప్పు వేయడం, వేర్లు నరకడం చేస్తుంటారు. దీని వల్ల దిగుబడి పెరుగుతుందని కొందరు చెబుతుంటారు. ఏడాది వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఏడాది దిగుబడి కొంత పెరగడం కనిపిస్తుంది. కానీ తర్వాత ఏడాది నుంచి దిగుబడి తగ్గిపోతుంది. అది చెట్టుకు కూడా హాని చేస్తుంది. ఇది అశాస్త్రీయమైన పద్ధతి అని, దీన్ని పాటించకపోవడం మంచిదని ఉద్యాన పరిశోధనా నిపుణులు చెబుతున్నారు.