News January 19, 2026

మోదీ బయోపిక్‌లో హాలీవుడ్ స్టార్.. బడ్జెట్ రూ.400కోట్లు

image

PM మోదీ బయోపిక్‌ను ‘మా వందే’ అనే టైటిల్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ పాత్రలో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. క్రాంతికుమార్ డైరెక్ట్ చేస్తుండగా సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వీర్ రెడ్డి రూ.400కోట్లతో నిర్మిస్తున్నారు. ‘ఆక్వామెన్’ ఫేమ్ జేసన్ మమోవాను ఓ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు మూవీ టీమ్ పేర్కొంది. JAN 22 నుంచి కశ్మీర్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Similar News

News February 19, 2026

కర్నూలు: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ గీత తెలిపారు. 5వ తరగతితో పాటు 6-10 తరగతుల్లో మిగులు సీట్లు, ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆసక్తిగల వారు https://apbragcet.apcfss.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

News February 19, 2026

మారే ప్రమాణాలు- మున్ముందు ప్రమాదాలు

image

నీట్ PGలో 0 మార్కుల అభ్యర్థులకూ అడ్మిషన్ రావడం ఆందోళనకరం. సీట్లు భర్తీ చేయడం, డాక్టర్ల కొరత తీర్చేందుకు ఇలా మార్కులు తగ్గించి అడ్మిషన్లు ఇవ్వడంపై మెడికల్ బాడీస్ సైతం అభ్యంతరం తెలిపాయి. ఇది ఫ్యూచర్‌లో భారత ఆరోగ్య రంగాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యగా అభివర్ణించాయి. అవసరమైతే స్టూడెంట్స్‌కు ట్రైనింగ్, ఫీజు మినహాయింపు, ఇన్సెంటివ్స్ లాంటివి ఇవ్వాలి తప్ప ఇదేం నిర్ణయమని సగటు మనిషి అభిప్రాయం. మీరేమంటారు..?

News February 19, 2026

ఆత్మ గౌరవం కోసం కొన్ని మార్గదర్శకాలు

image

☛ నిన్ను దూరం పెట్టే వారికి దగ్గరవ్వాలని ప్రయత్నించకు.
☛నీ నిజాయితీని గుర్తించని చోట నీ విలువైన కాలాన్ని వృథా చేయకు.
☛ ఆత్మాభిమానాన్ని మించిన సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదని తెలుసుకో.
☛ మనస్ఫూర్తిగా పిలవని చోటుకి, అది ఎంత పెద్ద ఇల్లైనా వెళ్ళకు.
☛ నీది కాని దాని మీద, నిన్ను దహించేంత అతిగా ప్రేమను పెంచుకోకు.