News January 19, 2026

నాగర్‌కర్నూల్: ప్రజావాణికి 40 దరఖాస్తులు

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 40 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ అమరేందర్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను ఏవో చంద్రశేఖర్‌తో కలిసి ఆయన స్వయంగా స్వీకరించారు. భూ సమస్యలు, వివిధ విభాగాల ఫిర్యాదులపై వచ్చిన ఈ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 10, 2026

WGL: మూగజీవాల దాహార్తిని తీర్చుదాం..!

image

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత వల్ల చెరువులు, కుంటలు ఎండిపోయి మూగజీవాలు తాగునీటి కోసం అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో, డాబాలపై మట్టి పాత్రల్లో నీటిని ఉంచాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. చిన్నపాటి గిన్నెల్లో నీరు పోసి ఉంచడం ద్వారా పక్షుల ప్రాణాలను కాపాడవచ్చని, ఈ వేసవిలో మూగజీవాల పట్ల మానవత్వం చాటుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
SHARE IT

News April 10, 2026

సిరిసిల్ల: ఘనంగా హోమియోపతి దినోత్సవం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొని హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హనేమాన్ ఫోటోకు నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. హోమియోపతి అనేది సహజ సిద్ధమైన మందులతో దుష్ప్రబావాలు లేని సురక్షితమైన చికిత్స విధానం అని తెలిపారు.

News April 10, 2026

ADB: టోల్‌ ప్లాజాలో నగదు చెల్లింపులు బంద్

image

నేటి నుంచి టోల్‌ ప్లాజాల్లో నగదు చెల్లింపులను అధికారులు నిలిపివేశారు. కేవలం ఫాస్టాగ్‌ లేదా యూపీఐ ద్వారానే రుసుము స్వీకరించనున్నారు. నిబంధన ఉల్లంఘించి నగదు ఇచ్చేవారు 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని రోలమామడ, గంజాల్‌ టోల్‌ ప్లాజాల వద్ద ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందుగానే ఫాస్టాగ్‌ రీఛార్జ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.