News January 19, 2026

ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంపీ చామల

image

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొంటున్నారు. ‘స్వనితి’ ఆధ్వర్యంలో నిర్వహించిన “ది మెరిడియన్ కలెక్టివ్” కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పాలన, సుస్థిర లక్ష్యాలపై ఈ సదస్సులో ఆయన చర్చించనున్నారు. అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రగతిని చాటిచెప్పేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని ఎంపీ కార్యాలయం తెలిపింది.

Similar News

News February 15, 2026

హస్తం జోరు.. ఇక GHMC ఎన్నికలేనా?

image

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తాచాటడంతో జోష్‌లో ఉంది. ఇదే ఊపులో GHMC ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు కావటంతో పలు విషయాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది. మే నెల చివరి కల్లా పాలకమండలి కొలువుదీరేలాగా సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. శివారు మున్సిపాలిటీల్లో హస్తానికి మిశ్రమ ఫలితాలొచ్చాయి.

News February 15, 2026

టోల్ వసూలు రూల్స్‌లో మార్పులు.. నేటి నుంచే!

image

నేషనల్ ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ వసూలు రూల్స్‌లో కేంద్రం మార్పులు చేసింది. ఇకపై పూర్తిగా అందుబాటులోకి రాని ఎక్స్‌ప్రెస్ వేల్లో మొత్తం టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. పనులు పూర్తయిన మేరకే ఛార్జీలు వసూలు చేస్తారు. ఇది నేటి నుంచే అమల్లోకి రానుంది. దీంతో కొంత భాగమే ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ భారం తగ్గనుంది. ప్రస్తుతం నేషనల్ హైవేలతో పోలిస్తే ఎక్స్‌ప్రెస్ వేలపై 25% ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

News February 15, 2026

తూ.గో: ఉదయాన్నే ప్రమాదం.. ఇద్దరి మృతి

image

దేవరపల్లి శివారులో కొత్తగూడెం ఫ్లై ఓవర్‌పై ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న బొలెరో వాహనం, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న దూమంతనగూడేనికి చెందిన పురుషుడు, మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. బొలెరో డ్రైవర్‌తో పాటు మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలు తెలియాల్సి ఉంది.