News January 19, 2026
ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

AP: 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 94% నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇక నుంచి ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రానికే డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. మరోవైపు నేతన్నలకు మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ కింద రూ.1.67కోట్లు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు.
Similar News
News February 11, 2026
చికెన్‌లో ఈ భాగాలు తినకండి

కోళ్ల లంగ్స్‌లోని పరాన్నజీవులు ఎక్కువ వేడిని తట్టుకోగలవు. మనం బాగా ఉడికించినా కొన్ని నశించకపోవచ్చు. పెస్టిసైడ్స్ తింటే కోడి తలలో చిన్న కణితులు ఏర్పడతాయి. కాబట్టి తల జోలికి వెళ్లకపోవడం బెటర్. కాళ్ల వేళ్లు, ప్రేగులు, జీర్ణాశయంలో బాక్టీరియా పేరుకుంటుంది. సాధారణంగా శుభ్రం చేస్తే అవి పోవు. స్కిన్ పూర్తిగా కొలెస్ట్రాల్ కావడంతో ఊబకాయులు, హార్ట్ సమస్యలు ఉన్నవారు తినకండి.
News February 11, 2026
జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం ఆగ్రహం

TG: సంగారెడ్డిలో జగ్గారెడ్డి <<19110877>>వ్యవహారంపై<<>> రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయన కామెంట్స్ ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. ఆయనపై కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. కాగా సీఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నారంటూ పోలీసులపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ఆపుతానంటూ పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.
News February 11, 2026
గోడపై క్యాలెండర్ మారుతున్నా జాబ్ క్యాలెండర్ రాదు: షర్మిల

AP: గవర్నర్ బడ్జెట్ ప్రసంగమంతా అవాస్తవాలు, కల్పితాలేనని APCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ‘కూటమి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్ అయ్యాయి. మెగా డీఎస్సీని దగా చేశారు. గోడపై క్యాలెండర్లు మారుతున్నా జాబ్ క్యాలెండర్ మాత్రం రావడం లేదు. అన్నదాత సుఖీభవ కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంతా ఫేక్’ అని ధ్వజమెత్తారు.


