News April 26, 2024

ఉమ్మడి కృష్ణా లయన్స్ క్లబ్ లీగల్ ఎయిడ్ ఛైర్మన్‌గా లంకిశెట్టి

image

అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్‌కు 2024-2025 సంవత్సరానికి గానూ లీగల్ ఎయిడ్ విభాగానికి ఎన్టీఆర్, కృష్ణాజిల్లా ఛైర్మన్‌గా మచిలీపట్నంకు చెందిన ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా గవర్నర్ శేషగిరిరావు ఉత్తర్వులు జారీ చేశారు. 18 సంవత్సరాలుగా బాలాజీ లయన్స్ క్లబ్‌లో అనేక పదవులు నిర్వహించి పలు సేవా అవార్డులు పొందారు.

Similar News

News September 30, 2024

విజయవాడ: శరన్నవరాత్రి ఉత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం

image

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబును సోమవారం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు, మంత్రితో కలసి చంద్రబాబుకు అమ్మవారి ప్రసాదం, ఆహ్వానపత్రిక అందజేశారు.

News September 30, 2024

ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ బాలాజీ

image

మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ప్రజల వద్ద నుంచి స్వీకరించిన సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూసినప్పుడే ప్రజలు సంతృప్తికరంగా ఉంటారన్నారు.

News September 30, 2024

సులభతరం కానున్న హైదరాబాద్-విజయవాడ బస్సు ప్రయాణం

image

తెలుగు రాష్ట్రాల్లో కీలక నగరాల మధ్య బస్సు ప్రయాణం సులభతరం వేగవంతం చేసేదిగా ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలకు సరికొత్త మార్గంపై దృష్టి సారించింది. ఔటర్ రింగ్ రోడ్ మీదగా బస్సులు నడిపించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సోమవారం నుంచి 2ఈ గరుడ బస్సుల్ని ఓఆర్ఆర్ మీదగా నడిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తద్వారా ప్రయాణికులకు 1.15 గంటల సమయం కలిసి రానుంది.