News January 19, 2026

రేపు ఆటోల బంద్.. క్లారిటీ

image

TG: రాష్ట్రంలో మంగళవారం ఆటోల బంద్‌ లేదని స్టేట్ టాక్సీ & ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెంటయ్యగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.12 వేల ప్రోత్సాహకాన్ని వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలనే డిమాండ్‌తో త్వరలోనే ఉద్యమం చేపడతామన్నారు. ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

Similar News

News February 25, 2026

SMA Type-1 వ్యాధి అంటే ఏంటి? చికిత్స ఖర్చు ఎందుకు ఎక్కువ?

image

‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’ వ్యాధినే SMA Type-1 అని అంటారు. ఇదొక జన్యుపరమైన వ్యాధి. SMN1 అనే జన్యువు లోపం వల్ల సంభవిస్తుంది. 6 నెలల్లోపు శిశువుల్లో తీవ్రమైన కండరాల బలహీనత, శ్వాస/మింగడంలో ఇబ్బందులు వస్తాయి. దీనికి Zolgensma అనే ఇంజెక్షన్‌ను తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీని తయారీ క్లిష్టతరం. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అందుకే దీని కాస్ట్ రూ.16 కోట్లు. చికిత్స తీసుకోకపోతే <<19232308>>రెండేళ్లలోపే<<>> మరణిస్తారు.

News February 25, 2026

AC ధరలు హీటెక్కిస్తాయి!

image

ఈ వేసవిలో AC కొనాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే! రాగి, అల్యూమినియం, స్టీల్ ధరలు మండిపోతుండటం, రూపాయి విలువ తగ్గడంతో ACల రేట్లు 5 నుంచి 15% పెరుగుతాయని వోల్టాస్ ఎండీ ముకుందన్ మేనన్ చెప్పారు. రాగి టన్నుకు 13 వేల డాలర్లు పలుకుతోంది. దీంతో పాటు కొత్త పవర్ సేవింగ్ రూల్స్ వల్ల ACల తయారీ ఖర్చు భారమైంది. ధరలు పెరిగినా ఈసారి అమ్మకాలు కూడా 20% పెరుగుతాయని ముకుందన్ తెలిపారు.

News February 25, 2026

బాలికలపై అత్యాచారం.. జ్యోతిషుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

image

తమిళనాడులోని శివగంగ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన జ్యోతిషుడు రామకృష్ణన్‌కు 200 ఏళ్ల జైలు శిక్ష, ₹2L జరిమానా విధించింది. అలాగే బాధితులకు ₹10L చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 14, 17 ఏళ్ల కూతుళ్లు సరిగ్గా చదవడం లేదంటూ తల్లి వారిని 2021లో జ్యోతిషుడి దగ్గరికి తీసుకెళ్లింది. అతను పరిహారం పేరుతో బాలికలపై అఘాయిత్యం చేశాడు.