News January 20, 2026

గుజరాత్‌పై RCB ఘన విజయం

image

WPLలో RCB హవా కొనసాగుతోంది. గుజరాత్‌పై 61 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో GG జట్టు తడబడింది. కెప్టెన్ గార్డ్‌నర్(54) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. RCB బౌలర్లలో సయాలి 3, నాడిన్ డి క్లెర్క్ 2, లారెన్ బెల్, రాధా యాదవ్, శ్రేయాంక తలో వికెట్ తీశారు. RCB వరుసగా 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.

Similar News

News February 20, 2026

22A నిషేధిత భూములపై మంత్రి కీలక ప్రకటన

image

AP: రాష్ట్రంలో 22A నిషేధిత భూముల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో తెలిపారు. ఆ జాబితా నుంచి ప్రైవేటు భూములను తొలగించే అధికారం RDOలకు అప్పగిస్తామన్నారు. భూమిని 22Aలో చేర్చాలంటే ఆ పట్టాదారునికి రిజిస్టర్డ్ పోస్టు/eKYC ద్వారా నోటీసు తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొన్నారు. పదేళ్ల కిందట అసైన్డ్ చేసిన ఇంటి స్థలాలకు పూర్తి హక్కులు కల్పించబోతున్నామని చెప్పారు.

News February 20, 2026

AI SUMMIT: రాహుల్ విమర్శ.. థరూర్ ప్రశంస!

image

కాంగ్రెస్‌లో ఎవరి దారి వారిదేనని మరోసారి నిరూపితమైంది. AI సమ్మిట్ లోపాలతో మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాల ముందు భారత్‌ను నవ్వులపాలు చేసిందని రాహుల్ మండిపడటం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా సమ్మిట్ బాగా జరిగిందని INC MP థరూర్ పొగిడారు. కొన్ని లోపాలు సహజమన్నారు. గతంలోనూ థరూర్ NDA ప్రభుత్వాన్ని మెచ్చుకోగా పార్టీ ఆయన్ను దూరం పెట్టింది. ఇటీవలే అవి సమసి ఆయనకు కేరళ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది.

News February 20, 2026

గ్లోబల్ ఈవెంట్‌లో నిరసనలపై విమర్శలు.. మీరేమంటారు?

image

ఢిల్లీలో జరుగుతోన్న AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ శ్రేణుల నిరసనలపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రదర్శనలకు ఎన్నో వేదికలు ఉన్నాయని, గ్లోబల్ ఈవెంట్‌లో ఇలా చేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. దేశాధినేతలు హాజరైన సదస్సులో చొక్కాలువిప్పి <<19192072>>ఆందోళనలు<<>> చేయడం దేశానికి అప్రతిష్ఠను కలిగిస్తాయని చెబుతున్నారు. అయితే ఏర్పాట్లలో లోపాలతో కేంద్రమే పరువు తీసిందని INC అభిమానులు కౌంటరిస్తున్నారు. మీరేమంటారు?