News January 20, 2026
కరీంనగర్: శాతవాహనలో క్రికెట్ ఎంపిక పోటీలు

జనవరి 26 నుండి ఫిబ్రవరి 4 వరకు జెఎస్ఎస్ అకాడమీ మైసూరులో జరగనున్న దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయ క్రికెట్ కోసం శాతవాహన విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన SU VC ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో క్రీడాకారులు తమ శారీరక ధృడత్వంతో శ్రమించి సత్తా చాటాలని అన్నారు. విశ్వవిద్యాలయానికి బహుమతులు తీసుకురావాలని కోరారు.
Similar News
News February 17, 2026
KCR బర్త్‌డే.. సాదాసీదాగా కవిత విషెస్

TG: మాజీ సీఎం, తన తండ్రి KCR పుట్టినరోజు సందర్భంగా కవిత ట్విటర్ వేదికగా విషెస్ తెలిపారు. ‘ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ఆమె సాదాసీదాగా ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇటీవల బీఆర్ఎస్‌తో పాటు కేసీఆర్‌పైనా ఆమె విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ కూడా KCRకు విషెస్ తెలిపారు.
News February 17, 2026
కాగజ్‌నగర్‌లో SP అఖిల్ తనిఖీలు

కాగజ్‌నగర్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తనిఖీ చేసి బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్పీ అఖిల్ తెలిపారు.
News February 17, 2026
నా కూతురిని రేప్ చేసి చంపేశారు: ప్రత్యూష తల్లి

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు <<19164468>>తీర్పును<<>> గౌరవిస్తున్నానని ఆమె తల్లి సరోజిని పేర్కొన్నారు. కానీ తనకు న్యాయం జరగలేదన్నారు. ‘నా కూతుర్ని అత్యాచారం చేసి చంపేశారు. నిందితుడికి జీవిత ఖైదు వేయాలని పోరాటం చేశా. కేసు మొదట్లోనే సాక్ష్యాలను తారుమారు చేశారు. ప్రత్యూష శరీరంపై గాట్లు ఉన్నాయి. ఆమెపై అత్యాచారం, హత్య జరిగిందని మునుస్వామి ఇచ్చిన రిపోర్టును ఎందుకు పక్కన పెట్టారు?’ అని ప్రశ్నించారు.


