News April 26, 2024
జైపూర్: గుప్తనిధుల కోసం తవ్వకాలు
జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న స్వామి దేవాలయంలోని దొనలో రెండు రోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొనలోని శివలింగాన్ని వదిలిపెట్టి పక్కన తవ్వకాలు చేపట్టారని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయంపై ఎస్సై శ్రీధర్ ను వివరణ కోరగా ఆలయ కమిటీ సభ్యుల ద్వారా ఫిర్యాదు అందిందని, విచారణ జరిపి తవ్వకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News January 10, 2025
కలెక్టర్ చేతుల మీదుగా ట్రెసా క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)-2025 క్యాలెండర్ ను గురువారం సాయంత్రం 4గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
News January 9, 2025
MNCL: ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించిన కలెక్టర్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సులేమాన్‌తో కలిసి కళాశాలలోని వివిధ విభాగాలు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించామన్నారు.
News January 9, 2025
విజనరీ లీడర్‌గా బాసర ఆర్జీయూకేటీ వీసీ
ప్రతిష్ఠాత్మక బిజినెస్ టాక్జ్ మ్యాగజైన్‌లో వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అలిసేరి స్థానం పొందారు. బిజినెస్ టాక్జ్ మ్యాగజైన్ తన తాజా ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత నాయకత్వాన్ని పునర్ నిర్వచించే ప్రముఖ వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా మార్పు, ఆవిష్కరణలకు అభివృద్ధికి సంబంధిన రంగాలలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులను సత్కరిస్తుంది.