News April 26, 2024

ఆర్మూర్: జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్యన్

image

ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఎల్లెందుల ఆర్యన్ జేఈఈ మెయిన్స్ లో 99.275 పర్సంటైల్ సాధించాడని వారి తల్లిదండ్రులు తెలిపారు. ఆర్యన్ హైదరాబాదులో ఇంటర్ పూర్తి చేశారు. ఆర్యన్ జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు పలువురు వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆర్యన్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తాను ఐఐటీలో చేరుతానని ఆర్యన్ తెలిపారు.

Similar News

News January 10, 2025

టీయూ: పీజీ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈనెల 20 నుంచి జరగాల్సిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. ఆమె మాట్లాడుతూ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 12 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ www.telanganauniversity.ac.in ను సందర్శించాలన్నారు. విద్యార్థులు గమనించాలని తెలిపారు.

News January 10, 2025

నిజామాబాద్: ‘సెలవులకు వెళ్లేవారు నిబంధనలు పాటించాలి’

image

సంక్రాంతి పండుగ సెలవులకు వెళ్లేవారు తూ.చా తప్పకుండా సూచించిన నిబంధనలు పాటించాలని ఇన్ ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ వెల్లడించారు. ఊరు వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకుండా బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలన్నారు. డోర్లకు సెంట్రల్ లాకింగ్ సిస్టం వాడాలని సూచించారు. సీసీ కెమెరాలు ఆన్‌లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులు వస్తే వారి సమాచారం పోలీస్ వారికి తెలియజేయాలన్నారు.

News January 10, 2025

ప్రజాక్షేత్రంలో మిస్టర్ క్లీన్ కేటీఆర్: జీవన్ రెడ్డి

image

ప్రజాక్షేత్రంలో KTR ను మిస్టర్ క్లీన్ గా ఆర్మూర్ మాజీ MLA జీవన్ రెడ్డి అభివర్ణించారు. కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేసింగ్ ఈవెంట్ ద్వారా హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చడానికి ప్రయత్నం చేశారే తప్ప CM రేవంత్ రెడ్డి మాదిరిగా తన సోదరులకు, బావమరుదులకు దోచిపెట్టడానికి కాదని ఆయన ఆరోపించారు. రేవంత్ లాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి పట్టుబడిన నేర చరిత్ర కేటీఆర్‌కు లేదన్నారు.