News April 26, 2024
నంద్యాల: రైలు ప్రయాణికులకు శుభవార్త

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. గుంటూరు సెక్షన్‌లో భద్రతాపరమైన పనుల వల్ల ఈ ఏడాది ఏప్రిల్ వరకు రద్దు చేసిన డోన్-గుంటూరు-డోన్ (17227/28) రైలును పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది. డీఆర్సీసీ మెంబర్ జుబేర్ బాషా కృషి ఫలితంగా ఈరైలును పునరుద్ధరించనున్నట్లు అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News April 24, 2025
కర్నూలు జిల్లా టాపర్లు వీరే!

కర్నూలు జిల్లా విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అదరగొట్టారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన ఏడుగురు 597 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు. కర్నూలుకు చెందిన టి.గాయత్రి, గీతిక, కీర్తన, ఎమ్మిగనూరుకు చెందిన మహ్మద్, ఆదోనికి చెందిన సలీమా, జి.నందు, హరిణి టాపర్ల జాబితాలో ఉన్నారు. ఇక జిల్లాలో మొత్తం 31,185 మంది పరీక్ష రాయగా 20,584 మంది పాసయ్యారు.

ఏ సబ్జెక్టులో ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే!

కర్నూలు జిల్లాలో 31,185 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 9,601 మంది ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో 2,598 మంది, హిందీలో 292, ఇంగ్లీష్‌లో 4,660, మ్యాథ్స్ 7,781, సైన్స్ 6,900, సోషల్‌లో 4,497 మంది ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇక తెలుగులో 91 మంది, హిందీలో 15, ఇంగ్లీష్‌లో 1, మ్యాథ్స్ 22, సైన్స్ 21, సోషల్‌లో 15 మంది 100/100 మార్కులు సాధించారని వివరించారు.