News January 20, 2026
కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డిపై కంప్లైంట్

ఖమ్మం సభలో సీఎం రేవంత్ బీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. సోమవారం ఎస్పీ రోహిత్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. ‘బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతున పాతాలి, గ్రామాల్లో పార్టీ దిమ్మెలను కూల్చాలి’ అంటూ హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Similar News
News February 19, 2026
తక్కువ ధరల్లో పశు ఔషధాలు: అచ్చెన్నాయుడు

AP: పశుపోషకులకు సబ్సిడీ ధరల్లో జనరిక్ పశు ఔషధాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘దీనికోసం పశు వైద్యశాలల ఆవరణలో 150 ఔషధ విక్రయ కేంద్రాలు పెడతాం. గొర్రెల పెంపక సహకార సంఘాలకు వీటిని అప్పగిస్తాం. ₹5.41 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలుచేస్తాం. యూనిట్ పెట్టేవారికి ప్రత్యేక సాయం కింద ₹1.5 లక్షలు అందిస్తాం. కొనుగోలుపై 20% ప్రోత్సాహకం, విక్రయాలపై 20% మార్జిన్ లభిస్తుంది’ అని మంత్రి చెప్పారు.
News February 19, 2026
HYD: ‘సెటిల్’ అంటే పెళ్లి కాదు

‘ముందు నా లైఫ్.. ఆ తర్వాతే ఎవరైనా’ నేటి యువత మంత్రం ఇదే. పాతతరంలా పెళ్లి, పిల్లలే జీవిత పరమార్థం అని వీరు అనుకోవడం లేదు. ట్రావెలింగ్, ప్యాషన్ ప్రాజెక్ట్స్, మెంటల్ హెల్త్‌కే ఫస్ట్ ప్రయారిటీ. పెళ్లైనా.. తమకంటూ కొంత పర్సనల్ స్పేస్ కావాలని కోరుకుంటున్నారు. ఇంట్లో ఆ స్వేచ్ఛ దొరకనప్పుడు జిమ్ములు, కేఫ్‌లు, ఆఫీసుల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ తమను తాము వెతుక్కునే పనిలో పడ్డారు.