News January 20, 2026
23న రాజధాని రైతులకు ఇ-లాటరీ: నారాయణ

AP: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు మంత్రి నారాయణ గుడ్‌న్యూస్ చెప్పారు. ‘అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈనెల 23న కేటాయిస్తాం. ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. రైతులు వాటిని అప్పటికప్పుడే రిజిస్టర్ చేయించుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న రైతులందరికీ అదే రోజు లాటరీ నిర్వహిస్తాం. రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది’ అని తెలిపారు.
Similar News
News March 19, 2026
మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఉ.గోదావరి, గుంటూరు, పల్నాడు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. రాత్రి నుంచి తిరుపతి, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు.
News March 19, 2026
కొత్త శక్తికి, ఆరంభానికి ప్రతీక ఉగాది: మోదీ

తెలుగు ప్రజలకు PM మోదీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ కొత్త శక్తికి, ఆరంభాలకు ప్రతీక అని గుర్తుచేశారు. రాబోయే సంవత్సరం ఆనందాలు, విజయాలు, ఆరోగ్యంతో నిండి ఉండాలని ప్రార్థించారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని AP CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘షడ్రుచులతో జీవన తత్వాన్ని ఆవిష్కరించే ఉషస్సు ఉగాది’ అంటూ TG CM రేవంత్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం ప్రజలకు విషెస్ చెప్పారు.
News March 19, 2026
IPL పేరుపై వివాదం.. కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) పేరును BCCI ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను కేరళ హైకోర్టు ఇటీవల కొట్టేసింది. IPL అధికారిక నేషనల్ టోర్నమెంట్ కాదని, అందువల్ల ‘ఇండియన్’ పదాన్ని వాడొద్దని పిటిషనర్ అషిక్ కరోత్ వాదించారు. కొన్నేళ్లుగా IPL జరుగుతున్నప్పటికీ ‘ఇండియన్’ పదం గురించి పిటిషనర్ ఆలస్యంగా గ్రహించారని, ఇది కోర్టు పరిధిలోకి రాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.


