News January 20, 2026

ప.గో: తల్లి చేసిన తప్పు.. పిల్లాడి ప్రాణం తీసిన కూల్ డ్రింక్!

image

భీమవరంలో తల్లి చేసిన తప్పు ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది. భర్తపై అలిగిన లక్ష్మి అనే మహిళ కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకుని కొంచెం తాగి నిద్రపోయింది. లక్ష్మి కుమారుడు మహా రుద్ర కాంత్ మిగిలిన కూల్ డ్రింక్‌ తాగేశాడు. అస్వస్థతకు గురైన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 17, 2026

రోడ్లు శుభ్రంగా లేకుంటే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తా: CM

image

TG: మున్సిపల్ అధికారులు, కమిషనర్లపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ‘త్వరలో GHMCలోని ప్రతి జోన్‌లో పర్యటిస్తా. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తా. కమిషనర్లు, జోనల్ కమిషనర్‌లు పొద్దునే ఫీల్డ్‌లో ఉండాలి. చాలా మంది వెళ్లట్లేదు. అలాంటి అధికారులపై వేటు వేస్తా’ అని మున్సిపల్ శాఖ సమీక్షలో హెచ్చరించారు. GHMC 3 కార్పొరేషన్లలో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

News February 17, 2026

పాలమూరు: పెద్దపులి సంచారం

image

అచ్చంపేట(M) గుంపల్లి గ్రామ శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో ఓ రైతు ఏర్పాటు చేసుకున్న పాకలో కట్టేసి ఉన్న ఎద్దుపై అర్ధరాత్రి పెద్దపులి దాడి చేసి గాయపరిచిందని స్థానికులు తెలిపారు. గ్రామ శివారులో పెద్దపులి సంచరిస్తుందనే సమాచారం చుట్టుపక్కల వ్యాపించడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు, అటవీశాఖ అధికారులు చేరుకొని పరిశీలిస్తున్నారు.

News February 17, 2026

నేటి రథోత్సవంతో ముగియనున్న జాతర

image

మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ సన్నిధి భక్తులతో జనసంద్రమైంది. ఎల్లలు దాటి తరలివచ్చిన లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిన్న రాత్రి బండ్ల ఊరేగింపు దుర్గమ్మ మురిసేలా జరిగింది. జాతరలో చివరి రోజైన ఇవాళ జరిగే రథోత్సవంతో ఈ మహా క్రతువు ముగియనుంది. పూలతో అలంకరించిన రథంలో వనదుర్గమ్మ ఉత్సవ విగ్రహన్ని ప్రతిష్ఠించి రాజగోపురం వరకు భక్తులు లాగుతారు.