News January 20, 2026

HURLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్ (<>HURL<<>>)లో 38 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, డిప్లొమా, MBA, MSW, పీజీ డిప్లొమా, MBBS, LLB ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్/స్క్రీనింగ్/సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.hurl.net.in/

Similar News

News February 21, 2026

రైతు బంధు నిధులు ఎక్కడ: హరీశ్ రావు

image

TG: రైతుబంధు పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ఆఫీసులను ముట్టడిస్తామని చెప్పారు. అటు మెదక్ మున్సిపాలిటీలో BRS కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారని మండిపడ్డారు. పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

News February 21, 2026

T20WC: భారీ వర్షం.. మ్యాచ్ రద్దు

image

కొలంబో: సూపర్-8లో న్యూజిలాండ్-పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దైంది. టాస్ పడిన కాసేపటికే వాన మొదలు కాగా ఇప్పటి వరకు తగ్గుతుందేమో అని వేచి చూశారు. ప్రస్తుతం వర్షం మరింత పెద్దది కావడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు టీమ్‌లు చెరొక పాయింట్ పంచుకోనున్నాయి. అటు రేపు పల్లెకెలెలో ఇంగ్లండ్-శ్రీలంక, అహ్మదాబాద్‌లో ఇండియా-సౌతాఫ్రికా తలపడనున్నాయి.

News February 21, 2026

6 రాష్ట్రాల్లో SIR పూర్తి.. గుజరాత్‌లో 68 లక్షల ఓట్లు తొలగింపు

image

దేశంలోని 6 రాష్ట్రాలు/UTలలో SIR(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పూర్తిచేసినట్లు EC వెల్లడించింది. వివిధ కారణాలతో అత్యధికంగా గుజరాత్‌లో 68.12L ఓట్లను తొలగించినట్లు తెలిపింది. MPలో 34.25L, రాజస్థాన్‌లో 31.36L, ఛత్తీస్‌గఢ్‌లో 24.99L, కేరళలో 8.97L, గోవాలో 1.27L, అండమాన్&నికోబార్‌లో 52K, పుదుచ్చేరిలో 77K, లక్షద్వీప్‌లో 206 ఓట్లను తీసివేసినట్లు పేర్కొంది. WB, TN, UP డేటాను ఈ నెలాఖరులో విడుదల చేస్తామంది.