News January 20, 2026
గ్రీన్‌లాండ్‌కు US యుద్ధ విమానం.. బలగాలను పెంచిన డెన్మార్క్

గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్ స్పేస్ బేస్‌కు అమెరికా తన యుద్ధ విమానాన్ని పంపింది. నార్త్ అమెరికా రక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు NORAD తెలిపింది. మరోవైపు డెన్మార్క్ కూడా గ్రీన్‌లాండ్‌కు అదనపు సైన్యాన్ని, మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ను తరలించింది. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలని ట్రంప్ చూస్తున్న తరుణంలో ఇరు దేశాలు తమ మిలిటరీ పవర్‌ను పెంచడం ఉత్కంఠ రేపుతోంది.
Similar News
News February 13, 2026
నల్గొండలో కాంగ్రెస్, కరీంనగర్‌లో బీజేపీ ఆధిక్యం

TG: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 48 డివిజన్లలో ఇప్పటివరకు లెక్కింపు పూర్తయిన వాటిలో పదింటిని హస్తం పార్టీ కైవసం చేసుకుంది. మరో 20 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. మరోపక్క ఇక్కడ BRS, BJPలు పలు డివిజన్లలో బాగా వెనుకబడి ఉన్నాయి. అటు కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉండగా BJP 28, కాంగ్రెస్ 19, BRS 13, ఇతరులు 2 చోట్ల ముందంజలో ఉన్నారు.
News February 13, 2026
వివిధ పంటల్లో తెగుళ్లు- నివారణకు సూచనలు

☛ మిరప, టమాటా, చిక్కుడు, ఆకుకూరల్లో ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు లీటరు నీటికి కార్బండిజం 1గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా కలిపి పిచికారీ చేయాలి. ☛ బీర, కాకర, దోస, పొట్ల, సొరలో బూజుతెగులు నివారణకు లీటరు నీటికి డైమెథోమోర్ఫ్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి. ☛ టమాటా, వంగ, క్యాప్సికంలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా.+ప్లాంటామైసిస్ 2గ్రా కలిపి పిచికారీ చేయాలి.
News February 13, 2026
ముత్యం ఉంగరం ధరిస్తే?

ముత్యం చంద్ర గ్రహానికి ప్రతినిధి. ఇది మనస్సును భావోద్వేగాలను శాంతంగా ఉంచుతుంది. మేష, కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారు ముత్యం ధరించాలని జ్యోతిషులు సూచిస్తున్నారు. దీనివల్ల రాజయోగం పడుతుందని చెబుతున్నారు. ‘ఇది కోపాన్ని తగ్గించి, మానసిక స్పష్టతను, సంపదను ప్రసాదిస్తుంది. ముత్యాన్ని వెండి ఉంగరంలో పొదిగి, సోమవారం నాడు కుడిచేతి చిటికెన వేలికి ధరిస్తే ఆరోగ్య, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది’ అంటున్నారు.


