News January 20, 2026

అమ్రాబాద్‌లో 11.8 డిగ్రీలు.. గజగజ వణుకుతున్న జిల్లా

image

నాగర్‌కర్నూలు జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో అమ్రాబాద్‌లో అత్యల్పంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కల్వకుర్తి, బల్మూరుల్లో 12.3, అచ్చంపేట, తెలకపల్లిలో 13.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మన్యం ప్రాంత ప్రజలు చలితో గజగజ వణుకుతున్నారు.

Similar News

News February 5, 2026

చీకటి పడ్డాక మార్స్ గ్రహం ఇలా ఉంటుంది!

image

మార్స్ గ్రహంపై రాత్రిళ్లు ఎలా ఉంటుందో చూపే దృశ్యాన్ని నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ బంధించింది. శాస్త్రవేత్తలు ఇటీవల డ్రిల్ చేసిన ఒక శిలలోని పొరలను నిశితంగా పరిశీలిస్తున్న సమయంలో ఈ అరుదైన ఫొటోను తీశారు. ఎర్రటి గ్రహంపై చీకటి పడిన తర్వాత అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో ఈ చిత్రం స్పష్టంగా చూపిస్తోంది. అంతరిక్ష రహస్యాలను ఛేదించే క్రమంలో రోవర్ పంపిన ఈ ఫొటో అంతరిక్ష ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

News February 5, 2026

80 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>UPSC<<>> 80 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ(BZC, ఫిజిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, జియోలజీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, Engg., ఎనిమల్ హజ్బెండరీ& వెటర్నరీ సైన్స్) అర్హత గలవారు FEB 24వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21- 32ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.upsc.gov.in

News February 5, 2026

VJA: అమ్మవారిని దర్శించుకున్న నీతి ఆయోగ్ CEO

image

నీతి ఆయోగ్ CEO బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గా మల్లేశ్వరస్వామి వార్లను గురువారం దర్శించుకున్నారు. ఆలయం మర్యాదలతో అధికారులు ఆయనకు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం వేద పండితులచే ఆశీర్వాదం అందించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు.