News January 20, 2026
కొనసాగుతున్న టారిఫ్‌ల ఎఫెక్ట్.. నష్టాల్లో మార్కెట్లు

ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఇంకా కొనసాగుతోంది. సెన్సెక్స్ 270 పాయింట్లు నష్టపోయి 82,975 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 76 పాయింట్లు కుంగి 25,509 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో SBI, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా, NTPC షేర్లు లాభాల్లో.. ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ఇండిగో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.93 వద్ద ప్రారంభమైంది.
Similar News
News February 20, 2026
ఆస్ట్రేలియాను ఓడించేందుకు ఇదే కరెక్ట్ టైమ్: ఒమన్ కెప్టెన్ జతీందర్

T20 WCలో ఆడిన 3 మ్యాచులూ ఓడి ఇంటిబాట పట్టిన ఒమన్ నేడు ఆస్ట్రేలియాతో తలపడనుంది. కనీసం దీంట్లోనైనా గెలిచి కంగారూలకు షాక్ ఇవ్వాలని ఆశిస్తోంది. అందుకు తమ ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారని కెప్టెన్ జతీందర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం వీక్‌గా ఉన్న ‘ఆసీస్‌ను ఓడించేందుకు ఇదే సరైన సమయం’ అని అభిప్రాయపడ్డారు. దీన్ని గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. T20 క్రికెట్‌లో ఏదైనా సాధ్యమేనని ధీమా వ్యక్తం చేశారు.
News February 20, 2026
‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానెల్ కూడా బ్లాక్ అవుతుందా?

ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్‌ను మెటా <<19187218>>బ్లాక్<<>> చేయడంతో అతడిపై ఫిర్యాదు చేసిన BJP నేత కరాటే కళ్యాణి స్పందించారు. అన్వేష్ యూట్యూబ్ ఛానెల్ సహా అన్నీ అకౌంట్లను డిలీట్ చేయించాలని CP సజ్జనార్‌ను కలవబోతున్నామని చెప్పారు. అలాగే పాస్‌పోర్ట్, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాలని కోరతామన్నారు. హిందువులను అన్వేష్ అవమానించారని, అతడికి జైలుశిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.
News February 20, 2026
చీర కట్టుకుంటున్నారా..? ఇలా చేస్తే సూపర్ లుక్

రోజూ ఎంత ట్రెండీ, ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకున్నా ప్రత్యేక సందర్భాల్లో మహిళలు చీరకే ఓటేస్తారు. అయితే చీర కట్టడంలో కొన్ని టిప్స్ పాటిస్తే లుక్ అదిరిపోతుందంటున్నారు నిపుణులు. ముందుగా చీర రంగు మీ ఒంటికి నప్పేదే ఎంచుకోవాలి. లైట్ కలర్ చీరైతే మంచి ప్రింట్స్ ఉండేలా చూసుకోవాలి. సరిగ్గా ఫిట్ అయ్యే బ్లౌజ్ వేసుకోవాలి. అప్పుడప్పుడూ డిఫరెంట్‌గా కట్టడం కూడా ట్రై చేయాలి. చీరను బట్టి జ్యువెలరీ ఎంచుకోవాలి.


