News January 20, 2026

ఉల్లిలో ఊదారంగు మచ్చ తెగులు – నివారణకు సూచనలు

image

ఉల్లి పంటలో కనిపించే తెగుళ్లలో ఉదారంగు మచ్చ తెగులు ఒకటి. అధిక వర్షాలు, అధిక తేమ ఉన్న సమయంలో ఈ తెగులు ప్రధాన పొలంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. దీని నివారణకు రైతులు ముందుగానే లీటరు నీటికి కార్బండజిమ్ 1గ్రా. లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News February 16, 2026

T20 WC: సూపర్-8లో భారత్‌కు టఫ్ ఛాలెంజ్!

image

T20 WCలో టీమ్‌ఇండియా సూపర్-8లో తలపడబోయే జట్లపై స్పష్టత వచ్చింది. భారత్‌తో పాటు ఇప్పటికే S-8కి అర్హత సాధించిన సౌతాఫ్రికా, వెస్టిండీస్ ఒకే గ్రూపు(G1)లో ఉండనున్నాయి. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య పోటీ ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా కూడా వస్తే ఈ గ్రూప్ టఫ్‌గా మారనుంది. భారత్ FEB 22న SA, 26న AUS లేదా ZIM, మార్చి 1న WIను ఢీకొట్టొచ్చు. అటు గ్రూపు-2లో SL, PAK, NZ, ENG జట్లు తలపడే అవకాశముంది.

News February 16, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

image

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి గడువును పెంచారు. ఫిబ్రవరి 15 ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అర్హులు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in

News February 16, 2026

విత్తనాలు కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి

image

విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సీల్ తీసి ఉన్న విత్తన సంచులు, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లోని విత్తనాన్ని కొనుగోలు చేయకూడదు. హైబ్రిడ్ విత్తనం( మొక్కజొన్న, మిరప పంటలకు) కొనుగోలు చేసేముందు విత్తనం రకం, భౌతిక, జన్యు స్వచ్ఛతలు, మొలకెత్తే స్వభావం అన్నీ లేబుల్ మీద సరిగా ఉన్నాయా, లేదా అని ఒకటికి రెండుసార్లు గమనించి కొనుగోలు చేయాలి.